చాయ్ వాలీ చాచీ!


Sun,January 13, 2019 02:01 AM

Chhattisgarh woman who has been drinking tea living life for 33 years

-33 ఏండ్లుగా టీ తాగి బతుకుతున్న ఛత్తీస్‌గఢ్ మహిళ

రాయ్‌పూర్, జనవరి 12: అసలే చలికాలం.. పొద్దుగాల లేవంగనే గరంగరం చాయ్ తాగడం చాలా మందికి అలవాటు. కానీ, ఛత్తీస్‌గఢ్‌లో ఓ మహిళ గత 33 ఏండ్లుగా కేవలం చాయ్ తాగి జీవిస్తున్నది. వినడానికి ఇది కొంచెం ఆశ్చర్యకరంగా ఉన్నా నమ్మక తప్పదు మరి!
కొరియ జిల్లాలోని బరాడియా గ్రామానికి చెందిన పిల్లి దేవి (44)ని అక్కడి స్థానికులు ముద్దుగా చాయ్ వాలీ చాచీ అని పిలుచుకుంటారు. ఆమె తన 11 ఏట నుంచి ఆహార పదార్థాల్ని పూర్తిగా వదిలిపెట్టి టీ తాగుతూ జీవిస్తున్నారని కుటుంబసభ్యులు చెప్పారు. నా కూతురు ఆరో తరగతిలో (11వ ఏట) ఉన్నప్పుడు ఒకసారి జిల్లా స్థాయి క్రీడల టోర్నమెంట్‌లో పాల్గొని ఇంటికి వచ్చింది. రాగానే గబగబ అన్నం తిని, నీళ్లు తాగింది. ఆ తర్వాత కొద్దిసేపటికి చాయ్‌తోపాటు బిస్కట్లు, బ్రెడ్ తిన్నది. క్రమంగా బ్లాక్ టీకి ఆమె అలవాటు పడింది. సూర్యాస్తమయం తర్వాత రోజుకో టీ మాత్రమే తాగేది. దీంతో మేం ఆందోళన చెంది వైద్యులకు చూపించాం. దేవి ఎలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడటం లేదని డాక్టర్లు చెప్పారు అని నాటి సంఘటనను దేవి తండ్రి రతిరామ్ గుర్తు చేసుకున్నారు. దేవి రోజులో అత్యధిక సమయం శివుడి సేవలోనే ఉంటుందని, అత్యంత అరుదుగానే ఇంటిని దాటి బయటకు వస్తుందని ఆమె సోదరుడు చెప్పారు. దేవి ఇలా ప్రవర్తించడానికి కారణం అంతుబట్టడంలేదని వైద్యులు చెప్పారని పేర్కొన్నాడు. దేవి పరిస్థితి విని తాను ఆశ్చర్యపోయానని కొరియ జిల్లా వైద్యకేంద్రం వైద్యుడు ఎస్‌కే గుప్తా చెప్పారు. 33 ఏండ్లుగా కేవలం టీ మాత్రమే తాగి జీవించడం సాధ్యంకాదని అన్నారు. దేవీ నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజులు ఉపవాసం చేసేవారిని చూశానుగానీ, ఇన్నేండ్లుగా ఆహారం తీసుకోకుండా జీవించడం విస్మయానికి గురిచేస్తున్నదని పేర్కొన్నారు.

474
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles