ఛత్తీస్‌గఢ్ గవర్నర్ కన్నుమూత


Wed,August 15, 2018 02:55 AM

Chhattisgarh Governor Balram Das Tandon passes away at 90

-బలరాంజీ టాండన్ సేవలను కొనియాడిన సీఎం రమణ్‌సింగ్
రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్ గవర్నర్ బలరాంజీ దాస్ టాండన్(90) మంగళవారం గుండెపోటుతో తుది శ్వాసవిడిచారు. బలరాంజీ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో గవర్నర్ కార్యాలయ అధికారులు ఆయనను రాయ్‌పూర్‌లోని అంబేద్కర్ మెమోరియల్ దవాఖానలో చేర్పించారు. చికిత్సపొందుతూ బలరామ్‌జీ మృతిచెందారని సూపరింటెండెంట్ వివేక్‌చౌదరి తెలిపారు. వెంటనే సీఎం రమణ్‌సింగ్ దవాఖానకు చేరుకొని గవర్నర్ మృతదేహాన్ని సందర్శించి నివాళి అర్పించారు. ఏడురోజులు రాష్ట్రంలో సంతాపదినాలను ప్రకటించారు. గవర్నర్ మృతి నేపథ్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు లేకుండా స్వతంత్ర వేడుకలు నిర్వహించనున్నట్టు సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.

1179
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles