హోర్డింగ్‌లకు ఎందరు బలి కావాలి?


Sat,September 14, 2019 02:18 AM

Chennai Techies Final Moments On Camera After AIADMK Banner Fell On Her

- తమిళనాడు సర్కార్‌పై మద్రాస్ హైకోర్టు మండిపాటు
- అధికారుల నుంచి వసూలు చేసి మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షలు చెల్లించాలని ఆదేశం


చెన్నై: చట్ట విరుద్ధంగా ఏర్పాటుచేసిన హోర్డింగ్‌లు, బ్యానర్ల విషయమై తమిళనాడు ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు తీవ్రంగా మందలించింది. ఈ బ్యానర్లు, హోర్డింగ్‌ల వల్ల ఎంత మంది ప్రాణాలు కోల్పోవాలని శుక్రవారం నిలదీసింది. గురువారం చెన్నై నగర శివారు ప్రాంతంలో ఒక హోర్డింగ్ మీద పడటంతో స్కూటీపై వెళుతున్న శుభశ్రీ (23) అనే యువతి అదుపు తప్పి నీటి ట్యాంకర్ కింద పడి మరణించారు. ఇటువంటి హోర్డింగ్‌లకు వ్యతిరేకంగా ప్రభుత్వం దృఢమైన చర్యలు తీసుకుంటుందా? అని జస్టిస్‌లు ఎం సత్యనారాయణన్, ఎన్ శేషసాయిలతో కూడిన డివిజన్ బెంచ్ ప్రశ్నించింది.

మృతురాలి కుటుంబానికి రూ.5 లక్షల తాత్కాలిక పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ పరిహారాన్ని హోర్డింగ్‌ల ఏర్పాటును నివారించలేకపోయిన అధికారుల నుంచి వసూలు చేయాలని కూడా ఆదేశాలు జారీచేసింది. యువతి దుర్మరణంపై సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం విచారణ జరిపింది. ఎన్ని లీటర్ల రక్తంతో రోడ్లు రక్తసిక్తం కావాలి? అని మండిపడింది. అధికార యంత్రాంగం ఉదాసీనత వల్ల ఈ దేశంలో ప్రజల ప్రాణాలకు విలువే లేకుండా పోయింది అని ఆందోళన వ్యక్తంచేసింది. ఈ రాష్ట్ర ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయాం అని ఘాటుగా వ్యాఖ్యానించింది.

343
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles