మళ్లీ సిద్ధమైన బాహుబలి!


Mon,July 22, 2019 12:35 PM

Chandrayaan 2 launch at 2:43pm on July 22

- సోమవారం మధ్యాహ్నం 2.43 గంటలకు జాబిల్లి యాత్ర
- చంద్రయాన్-2 కొత్త ప్రయోగ తేదీని ప్రకటించిన ఇస్రో


బెంగుళూరు, జూలై 18: సాంకేతిక సమస్య తో మూడు రోజుల క్రితం నిలిచిపోయిన చంద్రయాన్-2 ప్రయోగం మళ్లీ ఈ నెల 22న నిర్వహిస్తామని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) గురువారం అధికారికంగా తెలిపింది. చంద్రయాన్-2ను తిరిగి ఈనెల 22 (సోమవారం) మధ్యాహ్నం 2.43 గంటలకు ప్రయోగిస్తాం అని ఇస్రో ట్వీట్ చేసింది. కోట్ల మంది ప్రజల కలల్ని చంద్రునిపైకి తీసుకెళ్లడానికి గతంలో కంటే మరింత శక్తిమంతంగా బాహుబలి సిద్ధమైంది అని తెలిపిం ది. ప్రయోగం వాయిదాకు కారణమైన సాంకేతిక సమస్యను సమస్య సరిచేశాం. ప్రస్తుతం మిషన్ పనితీరు సాధారణంగా ఉంది అని ఇస్రో వెబ్‌సైట్ పేర్కొంది. చంద్రయాన్-2 ప్రయోగ సమయంలో వెన్నంటి ఉన్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపింది. ద్రవ ప్రొపెల్లెంట్‌ను క్రయోజెనిక్ ఇంజిన్‌లోకి ఎక్కిస్తుండగా లీకేజీ ఏర్పడటంతో చంద్రయాన్-2 ప్రయోగం ఈనెల 15న వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ముందుచూపుతో ప్రయోగాన్ని వాయిదా వేసిన ఇస్రో శాస్త్రవేత్తలను పలువురు ప్రశంసించారు. చంద్రయాన్-2 ప్రయోగాన్ని లాంచ్‌ప్యాడ్‌కి కొన్ని కి.మీ. దూరంలోని గ్యాలరీ నుంచి ఐదువేల మంది వీక్షించవచ్చని, ఈ నెల 22న జరిగే ప్రయోగం చూడాలనుకున్న వారు తమ పేర్లు మళ్లీ నమోదు చేసుకోవాలని ఇస్రో సూచించిం ది. వాస్తవంగా గత జనవరిలోనే జరుగా ల్సిన చంద్రయాన్-2 ప్రయోగం జూలై 15 కు వాయిదా పడింది. రూ. 976 కోట్లతో రూపొందించిన చంద్రయాన్-2లో భాగం గా 3,850 కిలోల బరువున్న పేలోడ్స్‌ను చంద్రునిపైకి పంపుతారు. జూలై 15న చేపట్ట తలపెట్టిన ప్రయోగంలో సెప్టెంబర్ 6న ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై సాఫ్ట్ (మృదువైన) ల్యాండింగ్ అవుతుందన్నది. ప్రస్తుత చంద్రయాన్-2 ప్రయోగంలో ల్యాండర్ ఏ తేదీన చంద్రుని ఉపరితలంపై దిగనున్నదన్న సంగతి ఇస్రో పేర్కొనలేదు.

1265
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles