ఆగిన చలో ఆత్మకూరు


Thu,September 12, 2019 02:19 AM

Chandrababu Naidu and his son Nara Lokesh placed under house arrest ahead of Atmakur rally

-రెండుపార్టీలకు అనుమతి నిరాకరణ
-ఏపీవ్యాప్తంగా టీడీపీ నేతల నిర్బంధం
అమరావతి/హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఏపీలోని గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతం లో చెలరేగిన గొడవల నేపథ్యంలో బుధవా రం ఇటు టీడీపీ, అటు వైఎస్సార్సీపీ ఇచ్చిన చలో ఆత్మకూరు కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. అధికార పార్టీ నేతలు తమ పార్టీ నాయకులపై దాడులకు దిగుతున్నారని ఆరోపిస్తూ టీడీపీ బుధవారం నిరసనలకు పిలుపునిచ్చింది. వైఎస్సార్సీపీ నాయకులు ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యం లో ఏపీలోని నర్సరావుపేట, సత్తనపల్లి, పల్నాడు, గురజాలలో బుధవారం 144, 30 సెక్షన్ అమల్లో ఉన్నట్టు ఏపీ డీజీపీ గౌతంసవాంగ్ ప్రకటించారు. ఎటువంటి నిరసన ప్రదర్శనలకు అనుమతి లేదని చెప్పారు. చ లో ఆత్మకూర్‌కు టీడీపీ నేతలు పర్మిషన్ తీసుకోలేదని అన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు.

చలో ఆత్మకూరుకు బయలుదేరకుండా రాష్ట్రవ్యాప్తంగా ముందస్తుగా పలువు రు టీడీపీ నేతలు, మాజీ మంత్రులను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. ఉండవల్లిలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆయ న కుమారుడు లోకేశ్, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, నన్నపనేని రాజకుమారిలను పోలీసులు అరెస్టుచేశారు. విజయవాడలో వర్ల రామయ్య, ప్రత్తిపాటి, దేవినేని, బుద్దా వెం కన్న, గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉ మ, తిరువూరులో మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసును గృహనిర్బంధం చేశారు. ఏపీలో తెలుగుదేశం పార్టీ అలజడి సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నదని వైఎస్సార్సీపీ నేత లు ఆరోపించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు టీడీపీ ఆందోళనపై మండిపడ్డారు.

126
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles