కేంద్ర ‘పంటల బీమా’ పెద్ద స్కామ్


Thu,January 10, 2019 02:26 AM

Centres Crop Insurance Scheme As Big Scam As Rafale

శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే ఆరోపణ
బీడ్ (మహారాష్ట్ర), జనవరి 9: రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు మాదిరిగానే కేంద్రం అమలుజేస్తున్న పంట బీమా పథకం కూడా అతిపెద్ద కుంభకోణం అని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే ఆరోపించారు. వర్షాభావ ప్రాంతం మరట్వాడాలో పర్యటిస్తున్న ఉద్ధవ్‌ఠాక్రే బుధవారం బీడ్ జిల్లాలో జరిగిన సభలో మాట్లాడుతూ.. తరుచుగా విదేశీ పర్యటనల్లో మునిగి తేలుతున్న ప్రధాని మోదీ ప్రసంగాలు, ప్రకటనలతో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తమతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తే, ముందుగా రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఎంత మందికి ఆర్థిక సాయం అందిందో చెప్పాలన్నారు. పంటల బీమా పథకం కింద రైతులకు రూ.2, రూ.5, రూ.50, రూ.100 విలువైన చెక్కులు వచ్చాయని ఉద్ధవ్‌ఠాక్రే ఎద్దేవా చేశారు. పంటల బీమా కింద వేలకోట్లలో కుంభకోణం జరిగిందన్నారు. ప్రముఖ జర్నలిస్టు సాయినాథ్ రాసిన పుస్తకంలో పంటల బీమా పథకం.. రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు మాదిరిగా అతిపెద్ద కుంభకోణం అని పేర్కొన్నారని ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు.

320
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles