డీఏ 3 శాతం పెంపు


Wed,February 20, 2019 01:54 AM

Centre hikes DA by 3pr move to benefit 11 crore employees and pensioners

-1.1 కోట్ల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి
-ఈ ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి
-ఏటా ఖజానాపై రూ.9,168 కోట్ల భారం
-ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ జారీకి ఆమోదం
-కేంద్ర మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు. డీఏ (కరువు భత్యం)ను 3 శాతం పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకున్నది. ఫలితంగా దేశవ్యాప్తంగా 1.1 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లు లబ్ధి పొందనున్నారు. ఈ ఏడాది జనవరి 1 నుంచి తాజా పెంపు అమల్లోకి రానున్నది. ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన మంగళవారం జరిగిన కేంద్ర మంత్రివర్గ భేటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 9 శాతం డీఏ అమల్లో ఉండగా, దీనికి అదనంగా మరో మూడు శాతం పెంచారు. డీఏ పెంపుతో 48.41 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 62.03 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనున్నది. తాజా పెంపు వల్ల కేంద్రంపై ఏటా రూ.9,168 కోట్ల భారం పడుతుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమావేశం అనంతరం తెలిపారు. కేంద్ర మంత్రివర్గ భేటీలో ఇతర అంశాలపైనా కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

మరోసారి ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్..

వివాదాస్పద ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌ను మరోసారి జారీచేయాలని కేంద్రం నిర్ణయించింది. గత ఏడాది సెప్టెంబర్‌లో ముమ్మారు తలాక్ ఆర్డినెన్స్‌ను కేంద్రం తీసుకువచ్చింది. డిసెంబర్ 17న ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. అయితే, విపక్షాల అభ్యంతరాలు, వ్యతిరేకత నేపథ్యంలో రాజ్యసభలో ఈ బిల్లును కేంద్రం ప్రవేశపెట్టలేదు. ఈ నేపథ్యంలో మరోసారి ఆర్డినెన్స్ తీసుకురా వాలని కేంద్రం నిర్ణయించింది.

మరోవైపు నేషనల్ ఎలక్ట్రానిక్స్ పాలసీ- 2019కి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశంలో 2025 నాటికి కోటి ఉద్యోగాల కల్పన, సుమారు రూ.20 లక్షల కోట్ల వాణిజ్యం లక్ష్యంగా ఈ విధానానికి రూపకల్పన చేశారు. రూ.30వేల కోట్లతో ఢిల్లీ-ఘజియాబాద్-మీరట్ మధ్య 82 కి.మీ. పరిధిలో రీజినల్ ర్యాపిడ్ ట్రాన్స్‌పోర్టు సిస్టమ్ ఏర్పాటుకు పచ్చజెండా ఊపారు.

1360
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles