ఇందిరా జైసింగ్ ఇంట్లో సీబీఐ సోదాలు


Fri,July 12, 2019 02:09 AM

CBI Raids Senior Lawyers Indira Jaising Anand Grovers Home Offices for Violating Foreign Funding Norms

- విదేశీ నిధుల దుర్వినియోగం కేసులో
- ఆమె భర్త ఆనంద్ గ్రోవర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు


న్యూఢిల్లీ: మానవ హక్కుల కేసులు వాదిం చే న్యాయవాదులు ఇందిరా జైసింగ్, ఆమె భర్త ఆనంద్ గ్రోవర్ నివాసం, కార్యాలయాలపై గురువారం సీబీఐ తనిఖీలు చేప ట్టిం ది. ఆనంద్ గ్రోవర్ నడుపుతున్న లాయర్స్ కలెక్టివ్ ఎన్జీవో సంస్థ కార్యాలయంలోనూ సీబీఐ తనిఖీలు చేపట్టింది. ఢిల్లీలోని ఇంది రా జైసింగ్ ఇల్లు, ఎన్జీవో ఆఫీస్, ముంబైలోని మరో ఆఫీసులో గురువారం ఉద యం 5గంటలకు వీటిని జరిపినట్టు సీబీఐ పేర్కొంది. లాయర్స్ కలెక్టివ్ పేరిట ఆనంద్ గ్రోవర్ ఓ ఎన్జీవోను స్థాపించారు. మానవ హక్కులను కోర్టుల దృష్టికి తీసుకెళ్లడంలో ఈ ఎన్జీవో సహకరిస్తుంది. లాయర్స్ కలెక్టివ్ కోసం విదేశీ సహకార నియంత్రణ చట్టాన్ని(ఎఫ్‌సీఆర్‌ఎ) ఉల్లఘించారని ఆనంద్‌గ్రోవర్‌పై కేసు నమోదైనట్టు సీబీఐ తెలిపిం ది. ఈ ఆరోపణలను లాయర్స్ కలెక్టివ్ తోసిపుచ్చింది. మాజీ అదనపు సొలిసిటర్ జనరల్ ఇందిరా జైసింగ్ పేరు ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేయకున్నా హోంశాఖ ఫిర్యాదులో ఆమె పేరు ప్రస్తావించారని సీబీఐ పేర్కొంది. 2006-07 నుంచి 2014-15 మధ్య ఆనంద్ గ్రోవర్ అధ్యక్షుడిగా ఉన్న లాయర్ కలెక్టివ్ ఎన్జీవో.. ఎఫ్‌సీఆర్‌ఎ నిబంధనలు ఉల్లంఘించి దాదాపు రూ.32 కోట్ల నిధులను పొందినట్టు హోంశాఖ తన ఫిర్యాదులో పేర్కొంది. మానవహక్కుల కోసం పోరాడటం వల్లే తనను, తన భర్తను లక్ష్యంగా చేసుకొని సీబీఐ దాడులను చేసిందని ఇందిరా జైసింగ్ ఆరోపించారు.

121
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles