సిద్ధూ రాజీనామా ఆమోదం!


Sun,July 21, 2019 02:13 AM

Captain Amarinder Singh accepts Navjot Singh Sidhus resignation

చండీగఢ్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ మంత్రి పదవికి రాజీనామా చేస్తూ పంపిన లేఖను పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ శనివారం ఆమోదించారు. సీఎం ఆ రాజీనామా లేఖను గవర్నర్‌ వీ పీ సింగ్‌ బడ్నోర్‌కి పంపించినట్టు ఓ అధికార ప్రతినిధి తెలిపారు. బుధవారం ఢిల్లీ నుంచి వచ్చిన అమరీందర్‌సింగ్‌ గత రెండు రోజులుగా అనారోగ్యంతో ఉన్నారని, శనివారం సిద్ధూ రాజీనామా లేఖను చూశారని చెప్పారు. కాగా ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా సిద్ధూ నిర్వహిస్తున్న మంత్రిత్వశాఖల్లో స్థానిక సంస్థలు, పర్యాటకం, సాంస్కృతిక శాఖలను తొలిగించి విద్యుత్తు, నూతన, సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖలను అప్పగించారు. దీనిపై కొద్దికాలంగా సిద్ధూ అసంతృప్తిగా ఉన్నారు.

450
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles