ఆధార్ గడువు పెంచేది లేదుSat,May 20, 2017 02:09 AM

-జూన్ 30 ఆఖరని సుప్రీంకు తెలిపిన ప్రభుత్వం
- సంక్షేమ పథకాలకు ఆధార్‌పై స్టేకు సుప్రీం నిరాకరణ

aadhaar
న్యూఢిల్లీ, మే 19: వివిధ సామాజిక సంక్షేమ పథకాలతో లబ్ధి పొందాలనుకునేవారు జూన్ 30లోగానే ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని, ఆ గడువు పెంచే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్)లో మాదిరి అక్రమంగా ఇతరులు ప్రయోజనం పొందకూడదన్న ఉద్దేశంతోనే ఈ నిబంధనను తప్పనిసరి చేసినట్టు ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ శుక్రవారం సుప్రీంకోర్టుకు నివేదించారు. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన పలు నోటిఫికేషన్లను సవాల్‌చేస్తూ దాఖలైన పిటిషన్లను ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం విచారించాల్సిందిగా ఆయన జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ నవీన్‌సిన్హా బెం చ్‌ను కోరారు. ఇదివరలోనూ పలు అభ్యర్థనలు దాఖలయ్యాయని గుర్తుచేశారు. ఒకే అంశానికి సంబంధించిన పిటిషన్లను విడిగా కాకుండా ఒకేసారి విచారించడమే సముచితమని అభిప్రాయపడిన ధర్మాసనం తదుపరి విచారణను జూన్ 27కు వాయిదావేసింది. జాతీ య బాలల హక్కుల పరిరక్షణ సంస్థ మాజీ చైర్‌పర్సన్ శాంతాసిన్హా దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం పై సీనియర్ అడ్వకేట్ శ్యాందివాన్ వాదించారు. జూన్ 30లోగా ఈ అంశాన్ని విచారించడం ముఖ్యమని, లేనిపక్షంలో ఆ గడువును పెంచాల్సి ఉంటుందని ఆయన పేర్కొనగా, అలాంటి ప్రసక్తే లేదని అటార్నీ జనరల్ రోహత్గీ ప్రతిస్పందించారు. మూడువారాల్లోగా ప్రభు త్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ, తాత్కాలిక ఊరటనివ్వాలని కోరుతూ వచ్చిన అభ్యర్థనలన్నింటిని జూన్ 27న విచారిద్దామని కోర్టు పేర్కొంది.

SupremeCourt
సం క్షేమ పథకాలకు ఆధార్‌ను అనుసంధానం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. ఆధార్ అనుసంధానం స్వచ్ఛందమే తప్ప తప్పనిసరి కాకూడదని ఇదివరలో ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం స్పష్టం చేసిందని శ్యాందివాన్ గుర్తుచేశారు. మొత్తం ఆధార్ వ్యవస్థ స్వరూపమే పౌరులపై నిఘావ్యవస్థగా రూపొందిందని, అది పౌరులపై ఆధిక్యత ప్రదర్శిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. సాంకేతిక కారణాల దృష్ట్యా పిల్ పిటిషనర్లు ఒక కోర్టు నుంచి మరో కోర్టుకు పరుగెత్తే పరిస్థితి, ఒక వాదనను మొత్తంగానే వినకుండానే నిరాకరించడం సముచితం కాదని ఆయన వ్యా ఖ్యానించారు. అప్పుడు రోహత్గీ స్పందిస్తూ.. ముంబై పేలుళ్ల కేసు దోషి యాకూబ్ మెమన్ విషయంలో కోర్టు తెల్లవారుజామున రెండు గంటలకు కూడా తలుపులు తెరిచిందని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికి 115 కోట్ల ఆధార్‌కార్డులు జారీ అయ్యాయని, ఆ సమాచారాన్ని ఇతరులకు ఇవ్వడం లేదని అటార్నీ జనరల్ తెలిపారు.

1495

More News

VIRAL NEWS