రాళ్లు రువ్వే ఘటనలు 90శాతం తగ్గాయిTue,November 14, 2017 01:25 AM

- నోట్ల రద్దు, ఎన్‌ఐఏ దాడులతో పరిస్థితుల్లో మార్పు
- కశ్మీరీల కృషి కీలకం: డీజీపీ ఎస్పీ వైద్
governance
జమ్ము: గతేడాదితో పోలి స్తే ఈ ఏడాది కశ్మీర్ లోయలో రాళ్లు రువ్వే ఘటనలు 90 శాతానికి పైగా తగ్గుముఖం పట్టా యని జమ్ముకశ్మీర్ డీజీ పీ ఎస్పీ వైద్ చెప్పారు. కశ్మీరీల కృషి వల్లే పరిస్థి తుల్లో మార్పు వచ్చిందన్నారు. జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాడులు, నోట్ల రద్దు, ఉగ్రవాదుల మద్దతు దారుల అరెస్టులు, పెరిగిన రాజకీయ కార్యకలాపాలు తదితర అంశాలు పరిస్థితిలో మార్పు రావడానికి కారణమని వైద్ సోమవారం పీటీఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ చెప్పారు. రాజకీయ నాయకులు సానుకూల వైఖరి ప్రదర్శించడం కూడా పరిస్థితుల్లో మార్పునకు మరో కారణమని, కేవలం ఎన్‌ఐఏ దాడులతోనే రాళ్లు రువ్వే ఘటనలు తగ్గాయంటే తాను ఆమోదించబోనని వైద్ అన్నారు. గత ఏడాదిలో ప్రతి శుక్రవారం కూడా 40 50 ఘటనలు జరిగేవని, ప్రస్తుతం ఒక్క ఘటన కూడా చోటు చేసుకోలేదని డీజీపీ వైద్ అన్నారు. ఉగ్రవాదం, మిలిటెంట్ల కట్టడికి రాష్ట్ర పోలీసులు, సైన్యం, ఇతర భద్రతా సంస్థల సిబ్బంది నిర్వహించిన ఆపరేషన్ ఆలౌట్ కార్యక్రమం అద్భుతమైన విజయాలు సాధించిందన్నారు. హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తాయిబా కమాండర్లలో అత్యధికులు హతమయ్యారు. ఈ ఏడాది జరిగిన ఎన్‌కౌంటర్లలో సుమారు 170 మంది మిలిటెంట్లను హతమార్చాం. ఇది ఒక రికార్డు అని అన్నారు.

196

More News

VIRAL NEWS