కాఫీ డే సిద్ధార్థ తండ్రి మృతి


Mon,August 26, 2019 01:40 AM

Cafe Coffee Day founder V G Siddhartha's father passes away

మైసూరు, ఆగస్టు 25: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ తండ్రి గంగ య్య హెగ్డే మృతి చెందారు. 95 ఏండ్ల హెగ్డే మైసూరులోని జీజీఎస్‌ఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. నెల రోజులకుపైగా ఈ ఆస్పత్రిలో కోమాలోనే ఉన్న ఆయనకు కొడుకు సిద్ధార్థ మరణవార్త కూడా తెలియదు. సిద్ధార్థ గత నెల 31న చనిపోయిన విషయం తెలిసిందే. నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానిస్తున్న సంగతి విదితమే. హెగ్డే కుటుంబానికి 130 ఏండ్లకుపైగా కాఫీ వ్యాపారంతో సంబంధాలుండగా, కర్నాటకలోని చిక్మగలూరు జిల్లాలో ఓ కాఫీ ఎస్టేట్ వద్ద హెగ్డే కాఫీ ప్లాంటర్‌గా ఉండేవారు. అయితే కాఫీ వ్యాపారిగా మారిపోయిన ఆయన స్థానికంగా మంచి గుర్తింపును తెచ్చుకున్నారు.

619
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles