మంగళసూత్రాన్ని మింగిన ఎద్దు


Sat,September 14, 2019 01:06 AM

Bull swallows gold mangalsutra worth Rs 1.5 lakh Vet extracts it from reticulum

- శస్త్ర చికిత్స చేసి బయటికి తీసిన వైద్యుడు.. మహారాష్ట్రలో ఘటన

పుణె: ఓ ఎద్దు మంగళసూత్రాన్ని మింగేసిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. రాష్ట్రంలోని కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో బేల్ పోలా పేరుతో ఎద్దుల పండుగను నిర్వహిస్తుంటారు. ఇందులో భాగంగా మహిళలు ఎద్దులకు ప్రత్యేకంగా తయారు చేసిన రొట్టెలను తినిపించి తమ మంగళసూత్రాన్ని దాని నుదిటికి తాకించి మొక్కుతారు. అహ్మద్‌నగర్ జిల్లాలోని రైతి వాఘాపూర్ గ్రామంలో ఈ పండుగను నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కరెంటు పోయింది. అయినా ఓ దంపతులు క్యాండిల్ వెలుగులో రెండు ఎద్దులకు పూజలు చేశారు. తర్వాత ఇంట్లోకి వెళ్లి చూసేసరికి మహిళ మెడలో మంగళసూత్రం కనిపించలేదు. ఎంత వెతికినా దొరకకపోవడంతో ఎద్దు మింగి ఉంటుందని అనుమానించారు. పశు వైద్యుడు ఎద్దు అన్న వాహికలో మంగళసూత్రం ఉన్నట్టు గుర్తించి, శస్త్రచికిత్స చేసి గొలుసును బయటికి తీశారు. గొలుసు విలువ రూ.1.5 లక్షలు ఉంటుందన్నారు.

124
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles