ప్రియుడి భార్యపై యువతి కత్తితో దాడి

Mon,November 11, 2019 12:34 AM

అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం పట్టణంలో దారుణం చోటుచేసుకున్నది. పెండ్లయిన వ్యక్తితో ప్రేమాయణం నడుపుతున్న ఓ యువతి.. ఆదివారం ప్రియుడి భార్యపై కత్తితో దాడిచేసింది. గర్భిణి అని చూడకుండా అతిదారుణంగా పొడిచింది. శ్రీనివాస్‌ అనే వ్యక్తికి మహేశ్వరితో వివాహమైంది. ప్రస్తుతం ఆమె గర్భిణి కూడా. రేష్మా అనే యువతి.. శ్రీనివాస్‌ను ప్రేమిస్తున్నది. తమ ప్రేమకు అడ్డుగా ఉన్నదని భావించి గర్భిణి అయిన మహేశ్వరిపై కత్తితో దాడిచేసింది. గాయపడ్డ మహేశ్వరిని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. నిందితురాలు రేష్మాను పోలీసులు అరెస్టు చేసి, విచారణ జరుపుతున్నారు.

112
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles