రాజ్‌పథ్‌పై ధనుష్ రాజసంTue,January 10, 2017 03:29 AM

బోఫోర్స్ గుర్తుందా? దేశ రాజకీయాలను కుదిపివేయడమేకాదు.. కార్గిల్ పోరాటంలోనూ ఈ దీర్ఘశ్రేణి శతఘ్ని విశేష సేవలందించింది. దానిని దేశీయంగా మరింత అభివృద్ధి చేస్తూ తీసుకువచ్చిందే ధనుష్! ఆ విశిష్ట ఆయుధం త్వరలో జరిగే గణతంత్ర ఉత్సవాల సందర్భంగా రాజ్‌పథ్‌పై రాజసం ఒలకబోయనుంది. బోఫోర్స్ గన్ నుంచి ధనుష్‌ను అభివృద్ధి చేసినా.. ఈ రెండింటికీ మధ్య పోలికే లేదంటున్నారు అధికారులు.

న్యూఢిల్లీ, జనవరి 9: లడఖ్ మంచుకొండల్లో.. రాజస్థాన్ ఎడారి ప్రాంతాల్లో దాదాపు నాలుగేండ్లపాటు పరిశీలన దశలో ఆర్మీతో ఉన్న మొట్ట మొదటి స్వదేశీ తయారీ ఆయుధం ధనుష్.. ఛబ్బీస్ జనవరి వేడుకల్లో రాజ్‌పథ్‌పై ప్రధాన ఆకర్షణగా నిలువనున్నది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్‌లో భాగంగా ఉన్న జబల్‌పూర్‌లోని గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ (జీసీఎఫ్) దీనిని అభివృద్ధి చేసింది. తనపై పడిన అపఖ్యాతిని, మరకలను తుడిచేసుకుని.. బోఫోర్స్ శతఘ్ని దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కొత్త రూపంలో కనువిందు చేయనుంది.
dhanush
వాస్తవానికి స్వీడన్‌కు చెందిన ఏబీ బోఫోర్స్ కంపెనీ దాదాపు 410 శతఘ్నులను తయారు చేయడంతోపాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చింది. కానీ.. దానిని పక్కన పెట్టేసిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ.. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ధనుష్‌ను తయారు చేసింది. ప్రాజెక్ట్ 155 అనే సాంకేతిక నామంతో ఈ ప్రాజెక్టును 2012 అక్టోబర్‌లో చేపట్టారు. కార్గిల్ ఘర్షణ తర్వాతి కాలంలో యావత్ ప్రపంచం 39 కాలిబర్ శతఘ్నుల నుంచి 45కు కొన్ని దేశాలు 52 శతఘ్నులకు మారాయి. ఉన్నంతలో ఇదే ఉత్తమమైన దీర్ఘశ్రేణి శతఘ్ని అని ఈ ప్రాజెక్టు హెడ్‌గా పని చేసిన రాజీవ్‌శర్మ చెప్పారు. ఫలితంగానే సామర్థ్యంలో, రూపంలో పెద్దదైన శతఘ్ని తయారైందని తెలిపారు.ఆయుధాలను కనిపెట్టే శత్రువుల రాడార్ దీనిని గుర్తించేలోపే లక్ష్యాలపై బాంబులు కురిపించగలగడం ధనుష్ ప్రత్యేకత. బోఫోర్స్ శతఘ్నుల స్థానంలో 414 ధనుష్ శతఘ్నులను ప్రవేశపెట్టాలని రక్షణ శాఖ భావిస్తున్నది. తొలి దశలో 114 శతఘ్నులు తయారు చేయాలని ఓఎఫ్‌బీని కేంద్రం కోరింది. మిగిలిన 300 శతఘ్నులను తదుపరి దశల్లో సైన్యానికి అందించాల్సి ఉంటుంది.

ఇది దేశీయ బోఫోర్స్.. కాదు!


list005
ఒక ధనుష్ శతఘ్ని తయారీకి రూ.13 కోట్లు ఖర్చవుతాయి. ఇప్పటి వరకు దీని అభివృద్ధికి రక్షణ శాఖ రూ.100 కోట్లు వెచ్చించింది. ధనుష్ బరువు 12.7 టన్నులు. ఆరు ధనుష్ శతఘ్నుల పనితీరును క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇటీవలే తిరిగి జబల్‌పూర్ ఫ్యాక్టరీకి తీసుకొచ్చారు. పరిశీలన దశలో వాటినుంచి దాదాపు 3500 రౌండ్లు కాల్చారు. దీని ఉపయోగంలో అనుభవంలోకి వచ్చిన అంశాలతో మరో 12 శతఘ్నులను తయారు చేయనున్నారు. దీనిని దేశీయ బోఫోర్స్ అని పిలిచేందుకు తాము ఇష్టపడటం లేదని జీసీఎఫ్‌లోని సీనియర్ జనరల్ మేనేజర్ చెప్పారు. బోఫోర్స్‌ను తలదన్నే శతఘ్ని ఇదని ఆయన గర్వంగా చెప్పారు. ధనుష్ అద్భుతమైన శతఘ్ని అని, భారత్ గర్వించే పద్ధతుల్లో తయారైందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ది ఇండియన్ ఆర్మీస్ ఆర్టిలరీ డైరెక్టరేట్‌గా ఇటీవల పదవీ విరమణ చేసిన లెఫ్టినెంట్ జనరల్ పీఆర్ శంకర్ చెప్పారు.

1800
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS