నవ్‌లఖాపై కేసు రద్దు కుదరదు


Sat,September 14, 2019 12:51 AM

Bombay HC refuses to dismiss Koregaon Bhima case against activist Gautam Navlakha

- కోరేగావ్-భీమా కేసులో స్పష్టంచేసిన బాంబే హైకోర్టు

ముంబై: కోరేగావ్-భీమా హింస కేసులో మానవ హక్కుల ఉద్యమకారుడు గౌతమ్ నవ్‌లఖాపై దాఖలైన కేసును రద్దుచేసేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. 2017 డిసెంబర్ 31న కోరేగావ్ యుద్ధ స్మారక స్థూపం వద్ద ఎల్గార్ పరిషత్ చేపట్టిన కార్యక్రమం సందర్భంగా అల్లర్లు చెలరేగిన కేసులో తనను పుణె పోలీసులు అరెస్టు చేయడాన్ని ఖండించిన నవ్‌లఖా.. తనపై దాఖలైన కేసును రద్దుచేయాలని బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలుచేశారు. ఈ పిటిషన్‌ను బాంబే హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఈ కేసు కోరేగావ్-భీమా హింసకు మాత్రమే పరిమితం కాదు. దీనికి ఇంకా అనేక కోణాలు ఉన్నాయి. కేసు తీవ్రతను పరిశీలిస్తే సమగ్ర దర్యాప్తు అవసరమని అనిపిస్తున్నదిఅని జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ భారతి డాంగ్రేలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. అందువల్లనే కేసును రద్దు చేయడం కుదరదని ధర్మాసనం స్పష్టంచేసింది. ఇలాఉండగా, నవ్‌లఖా న్యాయవాది విజ్ఞప్తి మేరకు.. తమ ఉత్తర్వులపై సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి వీలుగా మూడువారాలపాటు మధ్యంతర రక్షణను కొనసాగించేందుకు ధర్మాసనం అంగీకరించింది.

103
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles