యూపీ సీఎంను చెప్పులతో కొట్టండిMon,April 16, 2018 02:13 AM

-కాంగ్రెస్ నాయకుడి వివాదాస్పద వ్యాఖ్యలు
DineshGunduRao
బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు దినేశ్ గుండూ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశా రు. ఉత్తర్‌ప్రదేశ్ సీఎం ఆదిత్యనాథ్ కర్ణాటకకు వచ్చినప్పుడు చెప్పులతో కొట్టాలన్నారు. ఉన్నావ్, కతువా లైం గికదాడి బాధితులకు సంఘీభావంగా శనివారం రాత్రి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ కర్ణాటకకు వచ్చి ప్రజలకు నీతులు చెబుతున్న యూపీ సీఎం యోగి ఓ వేషధారి.. అబద్ధాలకోరు.. ఆయన్ను అడుగుపెట్టనివ్వొద్దు. ఒకవేళ యోగి ఆదిత్యనాథ్.. కా దు.. యోగి అని పలుకనవసరం లేదు. భోగి రాష్ట్రంలోకి వస్తే చె ప్పులతో కొట్టి పంపండి అని అన్నారు. ఈ వ్యాఖ్యలను తీవ్రం గా ఖండించిన బీజేపీ.. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన ఓ సీఎం ను కించపర్చడం తగదన్నది. తన వ్యాఖ్యలపై దుమారం రేగడం తో గుండూరావు స్పందిస్తూ ఏదో భావోద్వేగంతో మాట్లాడానని, ఆయన వస్తే చెప్పులు చూపాలని మాత్రమే అన్నానన్నారు.

1321

More News

VIRAL NEWS