బీజేపీ ఎంపీ కాళ్లు కడిగి.. ఆ నీళ్లు తాగిన కార్యకర్త


Tue,September 18, 2018 02:10 AM

BJP Man Who Washed Lawmaker s Feet Drank The Water

-సామాజిక మాధ్యమాల్లోవైరల్‌గా మారిన వీడియో
-మండిపడ్డ కాంగ్రెస్..జార్ఖండ్‌లో ఘటన

న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యాఖ్యలు చేసే జార్ఖండ్‌లోని గొడ్డ నియోజకవర్గ బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయన కాళ్లను కడిగిన పార్టీ కార్యకర్త.. అవే నీళ్లను తాగిన వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దూబే ఆదివారం గొడ్డ లోక్‌సభ నియోజకవర్గంలో పర్యటించారు. వంతెన నిర్మాణం గురించి ప్రకటించేందుకు కాన్హవార గ్రామానికి వెళ్లారు. ఈ సమయంలో దూబే కాళ్లను కడిగిన ఒక బీజేపీ కార్యకర్త.. అవే నీటిని అందరి సమక్షంలో తాగాడు. ఈ ఘటనను అక్కడే ఉన్నవారు వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఎంపీ దూబే సైతం తన అధికారిక ఫేస్‌బుక్ పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఎవరో కార్యకర్త ఇష్టంతో తన కాళ్లు కడిగాడని సమర్థించుకున్నారు. సామాజిక మాధ్యమాల్లో దీనిపై నెటిజన్లు మండిపడటంతో వెంటనే ఫేస్‌బుక్ పోస్ట్‌ను తొలిగించారు. బీజేపీ నేత తీరుపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా స్పందిస్తూ.. అహంకారపూరితమైన నిశికాంత్ లాంటి బీజేపీ నాయకులు.. ఇతరులను కించపరుచడమే అలవాటుగా మార్చుకుని, తమకు తాము దేవుళ్లుగా చెప్పుకొంటున్నారని మండిపడ్డారు.

594
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles