చిన్మయానంద్‌ను ప్రశ్నించిన సిట్


Sat,September 14, 2019 01:02 AM

BJP leader and former mp chinmayanand questioned for 7 hours by up police over shahjahanpur case

షాజహాన్‌పూర్: న్యాయ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేత చిన్మయానంద్‌ను సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆయన నివాసంలో విచారించింది. గురువారం ఏడు గంటల పాటు ఆయను ప్రశ్నించిన సిట్ అధికారులు.. తర్వాత చిన్మయానంద్ బెడ్‌రూమ్‌కు తాళం వేశారని పోలీసు వర్గాలు శుక్రవారం తెలిపాయి. బాధితురాలిని శుక్రవారం ఉదయం చిన్మయానంద్ నివాసానికి తీసుకు వచ్చి, ఆమె సమక్షంలో ఆయనను సిట్ ప్రశ్నించింది. ఈ సమయంలో ఫోరెన్సిక్ నిపుణులు కూడా అక్కడే ఉన్నారని పోలీసు వర్గాల కథనం.

112
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles