ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు


Tue,April 16, 2019 11:23 AM

BJP Kerala chief in trouble for comments against Muslims

-దుస్తులను తొలిగిస్తే సులభంగా గుర్తుపట్టొచ్చన్న కేరళ బీజేపీ అధ్యక్షుడు
-సర్వత్రా ఖండనలు
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: కేరళ బీజేపీ అధ్యక్షుడు పీఎస్ శ్రీధరన్ పిైళ్లె ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దుస్తులను తొలిగిస్తే ముస్లింలను సులభంగా గుర్తుపట్టొచ్చంటూ వ్యాఖ్యానించారు. ముస్లింల సంప్రదాయ పద్ధతైన సున్తీని దృష్టిలో ఉంచుకొని చేసిన ఈ వ్యాఖ్యలు.. రాష్ట్రంలో దుమారాన్ని రేపాయి. పలు పార్టీలు శ్రీధరన్ పిైళ్లె, బీజేపీని లక్ష్యంగా చేసుకొని విరుచుకుపడుతున్నాయి. ఆదివారం అత్తినగల్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో శ్రీధరన్ పిైళ్లె పాల్గొన్నారు. బాలాకోట్ దాడిపై ఆధారాలు చూపాలంటూ ప్రతిపక్షాలు డిమాండ్ చేయడంపై మాట్లాడుతూ రాహుల్‌గాంధీ, ఏచూరీ, పినరాయి విజయన్ వంటివారు.. అక్కడికి(బాలాకోట్) మన సైనికులు వెళ్లి ఎంతమంది చనిపోయారు? వారి కులం.. మతం వంటి వివరాలు తెలుసుకోవాలంటున్నారు. చనిపోయింది ముస్లింలు అయితే గుర్తించడం చాలా సులభం. వాళ్ల దుస్తులను తొలగిస్తే ఎవరో తెలిసిపోతుంది.

ఇలా వివరాలన్నీ సేకరించి తిరిగి రావాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి అని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్‌డీపీ, కాంగ్రెస్ పార్టీలు శ్రీధరన్‌పై మండిపడ్డాయి. ఆయన మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని, కోడ్‌ను ఉల్లంఘించారని సీపీఐ నాయకుడు వీఎస్ సివంజుట్టి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదుచేశారు. శ్రీధరన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకుడు రమేశ్ చెన్నితల డిమాండ్ చేశారు. కేరళ ప్రజలను విభజించి తన ఓటుబ్యాంకు పెంచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని ఐయూఎంఎల్ నాయకుడు, మలప్పురం ఎంపీ పీకే కున్హలికుట్టి ఆరోపించారు. ఈ విమర్శలపై శ్రీధరన్ స్పందిస్తూ.. ముస్లింలను కించపరిచేలా తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. తనపై వస్తున్న ఆరోపణలు చేస్తున్నవారిపై, ఈసీకి ఫిర్యాదుచేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు.

173
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles