సైన్యంపై భగవత్ వ్యాఖ్యలు సిగ్గుచేటుTue,February 13, 2018 01:26 AM

-ఆయన క్షమాపణ చెప్పాల్సిందే
-కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్
-భగవత్ వ్యాఖ్యలను వక్రీకరించారు: ఆరెస్సెస్

Rahul
జెవార్గి/ న్యూఢిల్లీ/ అగర్తల, ఫిబ్రవరి 12: దేశ భద్రత కోసం ప్రాణ త్యాగాలు చేస్తున్న సైన్యాన్ని ఉద్దేశించి ఆరెస్సెస్ అధినేత మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. దీనిపై మోహన్ భగవత్ క్షమాపణ చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఆరెస్సెస్ కార్యకర్తల సమావేశంలో ఆదివారం మోహన్ భగవత్ మాట్లాడుతూ యుద్ధానికి సంసిద్ధం కావడానికి సైన్యానికి ఆరేడు నెలల సమయం పడుతుంది. కానీ మనకు (ఆరెస్సెస్ శ్రేణులకు) రెండు, మూడు రోజులు చాలు. ఇది మన సామర్థ్యం. ఇది మన క్రమశిక్షణ అని అన్నారు. దీనిపై సోమవారం కర్ణాటకలోని జెవార్గిలో రాహుల్ మీడియాతో మాట్లాడుతూ సరిహద్దుల్లో మన సైనిక జవాన్లు రక్తం ధారపోస్తున్నారు. సైన్యం గురించి మోహన్ భగవత్ వ్యాఖ్యలు వినడానికే బాధగా ఉంది. సైనికులు దేశ భద్రత కోసం పని చేస్తున్నారు. ప్రాణ త్యాగం చేస్తున్న సైనికులపై భగవత్ వ్యాఖ్యలు వారిని అవమానించడమే. ఇది ప్రతి భారతీయుడికి అవమానకరమే. ప్రతి సైనికుడు జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పిస్తారు. భగవత్ వ్యాఖ్యలు మన జాతీయ పతాకాన్ని అవమానించడమే అని అన్నారు. భగవత్ వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఆరెస్సెస్ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. భగవత్ వ్యాఖ్యలను వక్రీకరించారని తెలిపింది.

250

More News

VIRAL NEWS