జార్ఖండ్‌ ఎన్నికలు..బీజేపీ తొలి జాబితా విడుదల

Mon,November 11, 2019 02:15 AM

- జంషెడ్‌ పూర్‌ (తూర్పు) నుంచి పోటీ చేయనున్న సీఎం రఘుబర్‌దాస్‌


రాంచీ, నవంబర్‌ 10: జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ 52 మందితో కూడిన తొలి విడుత అభ్యర్థుల జాబితాను ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితాలో 17 మంది ఎస్టీలకు, 21 మంది ఓబీసీ, ఐదుగురు మహిళలకు చోటు కల్పిస్తున్నట్లు బీజేపీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌ సింగ్‌ ప్రకటించారు. రాష్ర్ట ముఖ్యమంత్రి రఘుబర్‌దాస్‌ జంషెడ్‌ పూర్‌(తూర్పు) నుంచి పోటీ చేస్తారని ఆయన తెలిపారు. ఈ జాబితాలో 30 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లు దక్కగా, మరో 10 మందికి నిరాశే ఎదురైంది. తొలి దశ పోలింగును దృష్టిలో పెట్టుకొనే ఈ జాబితాను విడుదల చేశామని, అయితే, మిగతా నాలుగు దశల్లో జరిగే పోలింగులో పాల్గొనే అభ్యర్థులను కూడా ఈ జాబితాలో చేర్చామని బీజేపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. మరోవైపు, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ పార్టీ కూడా ఐదుగురు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. నవంబరు 30 నుంచి జార్ఖండ్‌లో ఐదు దశల్లో పోలింగ్‌ జరుగనుంది. డిసెంబరు 7, 12, 16, 20 తేదీల్లో దశలవారీగా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఫలితాలు డిసెంబరు 23న ప్రకటించనున్నారు.

111
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles