విశ్వాస పరీక్ష నెగ్గిన బీరేన్ ప్రభుత్వం

Tue,March 21, 2017 02:19 AM

biren-singh
ఇంఫాల్: మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరేన్‌సింగ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో గట్టెక్కింది. సోమవారం అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష జరిగింది. బీజేపీకి అనుకూలంగా 32 ఓట్లు రావడంతో ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించినట్టు స్పీకర్ ప్రకటించారు. విశ్వాస పరీక్షకు ముందు నుంచి బీజేపీ పకడ్బందీ వ్యూహంతో ముందుకు సాగింది. స్వతంత్ర, తృణమూల్ కాంగ్రెస్‌తోపాటు పార్టీ ఎమ్మెల్యేలను గువాహటిలోని హోటల్‌కు తరలించింది. వారిని అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి తీసుకెళ్లింది. 60 స్థానాలు ఉన్న మణిపూర్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో 28 స్థానాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 21 స్థానాల్లో విజయం సాధించింది. అయితే, నాలుగేసి స్థానాల్లో విజయం సాధించిన నేషనల్స్ పీపుల్స్ పార్టీ, నాగా పీపుల్స్ ఫ్రంట్‌లతోపాటు లోక్‌జనశక్తి పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతు ఇచ్చారు. దీంతో ఈనెల 16న మణిపూర్ ముఖ్యమంత్రిగా బీరేన్ సింగ్ ప్రమాణం చేశారు.

366

More News

మరిన్ని వార్తలు...