రెండో రోజూ బంద్.. పాక్షికం!


Thu,January 10, 2019 02:17 AM

Bharat Bandh Strike enters second day

న్యూఢిల్లీ, జనవరి 9: కార్మిక సంఘాలు చేపట్టిన భారత్ బంద్ రెండో రోజూ పాక్షికంగానే ప్రభావం చూపింది. పశ్చిమబెంగాల్‌లో కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి. సీల్‌దా-బాన్‌గావ్ సెక్షన్‌లో రైలు పట్టాలపై గల బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు. కొన్ని రాష్ర్టాల్లో బ్యాంకు సేవలు పాక్షికంగా స్తంభించాయి. బుధవారం పశ్చిమబెంగాల్‌లోని హౌరా జిల్లాలో ఆందోళనకారులు పాఠశాల బస్సుపై రాళ్లు రువ్వారు. కేరళలోని తిరువనంతపురంలో ఎస్బీఐ ట్రెజరీ శాఖపై ఆందోళనకారులు దాడి చేశారు. తమిళనాడులోనూ కొన్ని చోట్ల ఆందోళనకారులు రైళ్లను అడ్డుకున్నారు. గోవాలో కొంత బంద్ ప్రభావం కనిపించింది. బెంగళూరులో బస్సులను వామపక్షాలు అడ్డుకున్నాయి. ఒడిశాలోనూ ఆందోళనకారులు రైళ్లను అడ్డుకున్నారు. హైదరాబాద్‌లో సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ బంద్ జయప్రదమైందన్నారు.

413
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles