మధ్యవర్తిత్వ నివేదికలో పలు షరతులు!

Mon,November 11, 2019 12:57 AM

- అందుకే సుప్రీంకోర్టు ఆ నివేదికను తోసిపుచ్చింది


న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద రామజన్మభూమి-బాబ్రీమసీదు అంశంపై మధ్యవర్తిత్వ కమిటీ ఇచ్చిన తుది నివేదికను సుప్రీంకోర్టు తిరస్కరించడం తెలిసిందే. ‘పరిష్కార’ ఒప్పందం( సెటిల్‌మెంట్‌ అగ్రిమెంట్‌)గా పిలుస్తున్న ఈ నివేదికను(కమిటీ తుది నివేదిక పేరుతో రిపోర్ట్‌ ఉంది) సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించేందుకు పలు కారణాలున్నట్టు తెలుస్తున్నది. సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వ కమిటీ ఇచ్చిన తుది నివేదికను తిరస్కరించడానికి.. అయోధ్య వివాదంతో సంబంధమున్న అన్ని పక్షాల సంతకాలు సదరు నివేదికపై లేకపోవడం ఒక కారణమైతే, సదరు నివేదిక షరతులతో కూడి ఉండటం మరో కారణం. ‘అయోధ్య అంశంలో కొన్ని పక్షాల మధ్య పరిష్కారం కుదిరింది’ అని రాసి ఉన్న మధ్యవర్తిత్వ కమిటీ నివేదికపై సున్నీ వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ జుఫార్‌ ఫారుఖీ సంతకం మాత్రమే ఉన్నది. ఇతరుల సంతకాలు లేవు. దీంతోపాటు అయోధ్య అంశంలో వక్ఫ్‌ బోర్డు షరతులు నివేదికలో పొందుపరిచారు. వివాద స్థలాన్ని ప్రభుత్వ పరం చేయాలి. ‘భారత పురావస్తు శాఖ ఆద్వర్యంలోని మసీదుల జాబితాను వక్ఫ్‌ బోర్డు ప్రభుత్వానికి అందిస్తుంది. ఆయా మసీదుల్లో ప్రార్థనలకు తమను అనుమతించాలి’ అన్న పలు షరతులు మధ్యవర్తిత్వ కమిటీ నివేదికలో ఉన్నాయి. దీంతో సదరు నివేదికను అత్యున్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

105
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles