‘కాశీ-మథుర’ నినాదానికి దూరం

Mon,November 11, 2019 01:59 AM

- స్పష్టం చేసిన ఆరెస్సెస్‌ అధిపతి మోహన్‌ భాగవత్‌


న్యూఢిల్లీ, నవంబర్‌ 10: అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు అనుకూల తీర్పు ఇచ్చిన నేపథ్యంలో వారణాసిలో, మథురలోనూ మసీదులను కూల్చి మందిరాలను కట్టాలన్న వాదనలు తెరపైకి వచ్చాయి. అయితే ఈ నినాదానికి ఆరెస్సెస్‌ దూరం గా ఉంటుందని సంస్థ అధిపతి మోహన్‌ భాగవత్‌ పేర్కొన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఆరెస్సెస్‌ ఎలాంటి ఆందోళనల్లో పాల్గొనదు’ అని స్పష్టం చేశారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత అనంతరం కొందరు ఆందోళనకారు లు వారణాసి, మథురలోనూ ఇలాం టి ఘటనలే పునరావృతం అవుతాయని పేర్కొన్నారు. ‘ఇదిఆరంభం మాత్రమే. ఇంకా కాశీ, మథుర బాకీ ఉన్నాయి’ అని కొందరు నినదించారు. వారణాసిలో కాశీవిశ్వనాథ ఆలయ ప్రహరీకి ఆనుకొని జ్ఞాన్‌వాపీ మసీదు, మథురలో శ్రీకృష్ణ జన్మభూమి ఆలయం పక్కనే షాహీఈద్గా ఉన్నాయి.

396
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles