మహిళా ఐపీఎస్‌ పై దాడి

Sat,November 9, 2019 02:05 AM

-ఢిల్లీ తీస్ హజారీ కోర్టు ఘటనలో కొత్త కోణం

న్యూఢిల్లీ, నవంబర్ 8: ఢిల్లీలోని తీస్‌హజారీ కోర్టు ప్రాంగణంలో ఢిల్లీ పోలీసులు, లాయర్లకు మధ్య పార్కింగ్ విషయంలో తలెత్తిన గొడవ ఘర్షణకు దారితీసిన ఘటనలో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. గత శనివారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి తాజాగా బయటపడిన సీసీటీవీ ఫుటేజ్, ఆడియో క్లిప్పింగ్‌లలో దాడి జరిగిన తీరు స్పష్టమైంది. ఘటన జరిగిన రోజు సంఘటన స్థలంలో ఉన్న ఢిల్లీ నార్త్ డిస్ట్రిక్ట్ డీసీపీ మోనికా భరద్వాజ్ పట్ల లాయర్లు దురుసుగా ప్రవర్తించినట్టు వీడియో ద్వారా తెలుస్తున్నది. తనను చుట్టుముట్టిన వాళ్లను చేతులు జోడించి సదరు అధికారిణి ప్రాధేయపడుతున్నట్టు వీడియోలో కనిపిస్తున్నది. అదే సమయంలో కోర్టు ప్రాంగణం లోపల వాహనాలకు కొందరు నిప్పు పెట్టారు. నిరాయుధురాలిగా ఉన్న ఆ అధికారిణిని రక్షించడానికి ఆ సమయంలో ఆమె తోటి పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకోనట్లయితే, ఆమె ప్రాణాలు ప్రమాదంలో పడేవని ఐఏఎన్‌ఎస్ న్యూస్ ఏజెన్సీ పేర్కొంది. కోర్టు ప్రాంగణంలోపల ఉన్న పోలీసు అధికారుల వాహనాలకు నిప్పు పెట్టడం, మోనికా భరద్వాజ్ , ఇతర పోలీసు కానిస్టేబుళ్లను నలుపు, తెలుపు దుస్తుల్లో ఉన్న వ్యక్తుల గుంపు చుట్టముట్టడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ కేసు విచారణకు ఈ వీడియో కీలకంగా మారింది. లాయర్ల మూకదాడిలో మోనికా తలకు గాయమైంది. కానిస్టేబుళ్లకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల్లో ఓ కానిస్టేబుల్ కర్ణభేరి తీవ్రంగా దెబ్బతిన్నది. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నది.

ఢిల్లీ పోలీసులపై దాడి గర్హనీయం

ఢిల్లీలో తీస్ హజారీ కోర్టు, సాకేత్ కోర్టు వద్ద పోలీసులపై దాడులను తెలంగాణ ఐపీఎస్ సంఘం తీవ్రంగా ఖండించింది.

726
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles