రుణం ఇవ్వలేదని బ్యాంకు సిబ్బందిపై దాడి

Thu,December 5, 2019 12:51 AM

-కెనరా బ్యాంకు మేనేజర్, మరో ఇద్దరికి గాయాలు

కోయంబత్తూర్: అప్పు ఇవ్వలేదనే కోపంతో బ్యాంకు సిబ్బందిపై దాడి చేశాడు. తమిళనాడుకు చెందిన వెట్రివేల్ మోటార్ల తయారీ పరిశ్రమను నడుపుతున్నాడు. అతడు ఈ ఏడాది మార్చిలో కోయంబత్తూర్‌లోని కెనరా బ్యాంకులో రూ.కోటి రుణం కోసం దరఖాస్తు చేశాడు. ఇందుకు అవసరమైన ఆస్తులను కూడా బ్యాంకుకు తాకట్టు పెట్టాడు. రుణం ఇప్పిస్తానని చెప్పిన మధ్యవర్తికి రూ.3 లక్షలు ముట్టజెప్పాడు. అయితే రుణం ఇచ్చేదిలేదంటూ బ్యాంకు తిరస్కరించింది. దీంతో వెట్రివేల్ కోపోద్రిక్తుడ య్యాడు. తుపాకీ, కత్తి తీసుకొని బ్యాంకులోకి దూసుకెళ్లాడు. అడ్డుకున్న ఇద్దరు ఉద్యోగులతోపాటు బ్యాంకు మేనేజర్‌పై దాడి చేశాడు. దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి రుణాన్ని ఉన్నతాధికారులే తిరస్కరించారని మేనేజర్ చంద్రశేఖర్ చెప్పారు. తాను అప్పుల్లో మునిగిపోయా నని, రుణం రాకుంటే ఆత్మహత్య చేసుకుందామనుకున్నానని వెట్రివేల్ చెప్పారు.

197
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles