5వేల నుంచి 10వేలకు పెంపు?


Wed,June 13, 2018 07:17 AM

Atal Pension Yojana Limit Could Be Doubled To Rs 10000

ఏపీవై పింఛను పరిమితి
pension
న్యూఢిల్లీ,: అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) కింద పెన్షన్ పరిమితిని రూ.5,000 నుంచి రూ.10వేలకు పెంచాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తున్నదని ఓ ఉన్నతాధికారి చెప్పారు. ఢిల్లీలో మంగళవారం పీఎఫ్‌ఆర్‌డీఏ (భవిష్యనిధి క్రమబద్ధీకరణ, అభివృద్ధి సంస్థ) ఏర్పాటు చేసిన ఒక సదస్సు లో ఆర్థిక సేవల విభాగం సంయుక్త కార్యదర్శి మద్నేశ్‌కుమార్ మిశ్రా మాట్లాడుతూ, పెన్షన్ మొత్తాన్ని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. పెన్షన్‌ను రూ.10వేలకు పెంచాలన్న పీఎఫ్‌ఆర్‌డీఏ పంపిన ప్రతిపాదన తమ పరిశీలనలో ఉందని చెప్పారు. ఖాతాదారుల సంఖ్యను పెంచే ఉద్దేశంతోనే పెన్షన్ పెంపు ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపామని పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్మన్ హేమంత్ కాంట్రాక్టర్ తెలిపారు. ఇప్పటి నుంచి 20-30 ఏండ్ల తరువాత 60 ఏండ్ల వయస్సులో రూ.5,000 ఏ మూలకూ చాలదని చాలామంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని అన్నారు. అందుకే పెన్షన్‌ను రూ.10వేలకు పెంచాలని నిర్ణయించామని చెప్పారు. ప్రస్తుతం 18 నుంచి 40 ఏండ్ల మధ్య వయస్సుగలవారినే చేర్చుకుంటున్నారు. వయోపరిమితిని పెంచడం వల్ల ఖాతాదారుల సంఖ్యను పెంచవచ్చని చెప్పారు. ప్రస్తుతం ఏపీవైలో 1.02 కోట్ల మంది ఖాతాదారులున్నారని తెలిపారు.

1948
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles