నిలకడగా వాజపేయి ఆరోగ్యం


Wed,June 13, 2018 03:16 AM

Atal Bihari Vajpayees Condition Stable

-కీలక అవయవాల పనితీరు బాగానే ఉంది
-ఇన్‌ఫెక్షన్ తగ్గేవరకు దవాఖానలోనే
-వాజపేయి ఆరోగ్యంపై ఎయిమ్స్‌వర్గాల వెల్లడి
-మాజీ ప్రధాని ఆరోగ్యంపై ఎయిమ్స్‌వర్గాల వెల్లడి
vajpayee
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఏబీ వాజపేయి ఆరోగ్యం నిలకడగా ఉందని ఎయిమ్స్ దవాఖాన తెలిపింది. చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని, ప్రస్తు తం యాంటిబయాటిక్స్ అందిస్తున్నామన్నది. వాజపేయి కీలక అవయవాల పనితీరు నిలకడగా ఉందని, ఇన్‌ఫెక్షన్ తగ్గేవరకు ఆయన దవాఖానలో ఉండాలని ఎయిమ్స్ మంగళవారం బులిటెన్‌లో తెలిపింది. మూత్రనాళ ఇన్‌ఫెక్షన్, శ్వాసకోశ, కిడ్నీ సంబంధిత సమస్యలతోన్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో సోమవారం వాజపేయి చేరిన సంగతి తెలిసిందే. ఎయిమ్స్ డైరెక్టర్ రణ్‌దీప్ గులేరియా పర్యవేక్షణలో నిపుణుల బృందం వాజపేయికి వైద్యసేవలు అందిస్తున్నట్టు ఎయిమ్స్‌వర్గాలు తెలిపాయి. వాజపేయికి సోమవారం నుంచి డయాలసిస్ చికిత్స జరుగుతున్నది. మరోవైపు వాజపేయి చేరికతో ఎయిమ్స్‌లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఐసీయూ మొదటి అంతస్తు కారిడార్‌లో ఆంక్షలు విధించారు. కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి అశ్వినికుమార్ చౌబే, కేంద్ర మాజీ మంత్రి కల్‌రాజ్ మిశ్రా, న్యాయశాఖ సహాయమంత్రి పీపీ చౌదరి మంగళవారం వాజపేయిని పరామర్శించారు. వాజపేయి త్వరగా కోలుకోవాలని ఎయిమ్స్ గేటుబయట ఢిల్లీ బీజేపీ యువ మోర్చా కోశాధికారి పంకజ్‌జైన్ హోమం నిర్వహించారు.
aims-delhi

459
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS