కల్తీ మద్యం మృతులు 61

Sun,February 10, 2019 02:43 AM

-యూపీలోని సహారన్‌పూర్‌లో 36 మంది,
-ఉత్తరాఖండ్‌లో 25 మంది బలి

హరిద్వార్/సహారన్‌పూర్: కల్తీ మద్యం కాటుకు ఉత్తరాఖండ్, ఉత్తర్‌ప్రదేశ్ రాష్ర్టాల్లోని సమీప జిల్లాల్లో మృతిచెందిన వారి సంఖ్య శనివారం నాటికి 61కి చేరింది. మరో 24 మంది దవాఖానల్లో మృత్యువుతో పోరాడుతున్నారు. గురువారం సాయంత్రం ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లా బాల్పూర్‌లో తమ బంధువు అంత్యక్రియలకు యూపీలోని సహారన్‌పూర్ జిల్లాకు చెందిన పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారంతా కల్తీ మద్యం తాగారు. వీరిలో ఒకరు బాల్పూర్ నుంచి 30 కల్తీ మద్యం పాకెట్లు తనతోపాటు తీసుకువచ్చి ఇతరులకు అమ్మాడు. అనంతరం మద్యం తాగిన వారంతా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. షహరాన్‌పూర్ జిల్లాకు చెందిన 36 మంది, ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాకు చెందిన 25 మంది మృతిచెందినట్లు అధికారులు ప్రకటించారు. మరోవైపు యూపీలోని ఖుషీనగర్‌లో కల్తీ మద్యం బారినపడి మృతిచెందిన వారి సంఖ్య తొమ్మిదికి చేరింది. అక్రమ మద్యాన్ని అరికట్టలేకపోయిన 27 మంది ఎక్సైజ్, పోలీసులపై యూపీ సర్కారు వేటు వేసింది. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల పరిహారం ప్రకటించింది.

781
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles