రవిశంకర్ మధ్యవర్తిత్వం అక్కర్లేదు


Tue,November 14, 2017 01:38 AM

Asaduddin Owaisi Slams Sri Sri Ravishankar On Mandir Talks

అయోధ్యపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్య
asaduddin
న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలం పెండింగ్‌లో ఉన్న అయోధ్య వివాదం పరిష్కారానికి ఆధ్యాత్మిక వేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్ మధ్యవర్తిత్వం అవసరం లేదని ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ స్పష్టంచేశారు. ఈ విషయంలో ఆయనకు ఎటువంటి అధికారమూ లేదని సోమవారం తోసిపుచ్చారు. ఇప్పటికే రవిశంకర్ మధ్యవర్తిత్వాన్ని ఆమోదించబోమని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్బీ) తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. ఇదేమీ పతంగులు ఎగురవేసినట్లు కాదన్నారు. మరోవైపు రామ మందిర నిర్మాణం అంశంపై బుధవారం అయోధ్యకు వెళ్లనున్నట్లు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు, ఆధ్యాత్మిక వేత్త శ్రీశ్రీ రవిశంకర్ చెప్పారు. ఈ అంశంపై చర్చలు సానుకూలంగా ఉన్నాయని తెలిపారు.

408
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS