సైకిల్ మాదే... కాదు మాదేTue,January 10, 2017 01:18 AM

న్యూఢిల్లీ, జనవరి, 9:సోమవారం ఢిల్లీలో ఎస్పీ వర్గాలు హల్‌చల్ చేశాయి. ఒకరి వెనుక మరొకరు ఈసీ గడప తొక్కి సైకిల్ గుర్తు కోసం మహజర్లు సమర్పించుకున్నాయి. ముందుగా ములాయంసింగ్ యాదవ్ ఈసీ అధికారులను కలిశారు. ఆ వెంటనే రాంగోపాల్ యాదవ్ ఈసీ కార్యాలయంలోకి అడుగుపెట్టారు. సమాజ్‌వాదీపార్టీ అధ్యక్షుడిని తానేనంటూ, సైకిల్ గుర్తు తన శిబిరానికే చెందాలంటూ ములాయంసింగ్ యాదవ్ ఎన్నికల సంఘానికి మరోమారు స్పష్టం చేశారు. యూపీ సీఎం అఖిలేశ్ యాదవ్ శిబిరం నిర్వహించిన సదస్సు పార్టీ రాజ్యాంగానికి విరుద్ధమైందని తెలిపారు.

సోమవారం తన విధేయులైన అమర్‌సింగ్, శివపాల్‌సింగ్ యాదవ్‌లను వెంటబెట్టుకుని ఆయన ఎన్నికల సం ఘం అధికారులను కలిశారు. అఖిలేశ్ వర్గం సమర్పించిన అఫిడవిట్లపై నకిలీ సంతకాలున్నాయని, దీనిపై ఈసీ తనిఖీ జరుపాలని వారికి సూచించినట్టు తెలిసింది. ఈసీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఉత్తర్‌ప్రదేశ్ పాలకపక్షాన్ని చుట్టుముట్టిన సంక్షోభానికి ఒకేఒక వ్యక్తి కారకుడని పరోక్షంగా రాంగోపాల్ యాదవ్‌పై మండిపడ్డారు. నా కుమారునికి నాకు మధ్య ఎలాంటి అగాధం లేదు అన్నారు. పార్టీలో కొన్ని సమస్యలున్నాయి.. ఈ గొడవ అంతటికీ ఒకే వ్యక్తి కారణం. విభేదాలను పరిష్కరించుకుంటామన్న నమ్మకం నాకుంది అని ములాయం పేర్కొన్నారు. ఆ తర్వాత అఖిలేశ్ వర్గం నాయకుడైన రాంగోపాల్ యాదవ్ ఈసీ అధికారులను కలిసి అసలుసిసలు ఎస్పీ తమదేనని, సైకిల్ గుర్తును తమకే కేటాయించాలని తెలిపారు. త్వరలో నామినేషన్లు ప్రారంభం కానున్న దృష్ట్యా సత్వరమే చిహ్నం గురించి నిర్ణయించాలని ఈసీని కోరేందుకు వచ్చాం అని రాంగోపాల్ యాదవ్ మీడియాకు చెప్పారు. ములాయం వ్యాఖ్యలపై మాట్లాడేందుకు ఆయన నిరాకరించారు. ఎస్పీ నుంచి బహిష్కృతుడైన రాంగోపాల్ రాజ్యసభ సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా ములాయం రాజ్యసభ చైర్మన్‌కు సోమవారం లేఖ రాశారు.

మనుమరాళ్ల రాయబారం


పార్టీ తగాదా తండ్రీ కొడుకుల తగాదాగా మారిన నేపథ్యంలో ములాయం మనుమరాళ్లు అంటే అఖిలేశ్ కూతుళ్లు రెండువర్గాల మధ్య శాంతిదూతలయ్యారని చెప్పుకుంటున్నారు. అదితి (15), టీనా (10) తాతయ్య దగ్గరికి రాకపోకలు సాగిస్తున్నారు. మీ నాన్న జగమొండి అని వారితో ములాయం అన్నారట. వారు ఆ సంగతి తండ్రి అఖిలేశ్‌కు చేరవేస్తే ఆయన ఔను జగమొండినే అని నవ్వేశారట.

322
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS