హిమపాతం కింద చిక్కుకొని ఆరుగురు జవాన్లు మృతి!


Thu,February 21, 2019 01:18 AM

Army soldier dead five missing in avalanche in Himachal Kinnaur

-భారత్-చైనా సరిహద్దులో దుర్ఘటన
సిమ్లా, ఫిబ్రవరి 20: భారత్-చైనా సరిహద్దులో హిమపాతం కింద చిక్కుకొని ఆరుగురు జవాన్లు మరణించారు. ఈ దుర్ఘటన బుధవారం హిమాచల్ ప్రదేశ్‌లోని సరిహద్దు జిల్లా కిన్నౌర్‌లో చోటుచేసుకుంది. షిప్‌కిలా పోస్ట్ వద్ద పాడైన నీటి సరఫరా పైప్‌లైన్‌కు మరమ్మతు చేయడానికి 16 మంది జవాన్లు నామాగ్య ప్రాంతం నుంచి బయలుదేరారు. అయితే వీరు షిప్‌కిలా పోస్ట్ సమీపానికి చేరుకునే సరికి ఒక్కసారిగా హిమపాతం కప్పేసింది. వెంటనే అప్రమత్తమైన బలగాలు 11 మందిని కాపాడాయి. వీరిలో తీవ్రగాయాలపాలైన రమేశ్‌కుమార్ ప్రాణాలు కోల్పోయారు. మిగిలిన ఐదుగురి ఆచూకీ దొరకడం లేదు. వారు మరణించి ఉంటారని అధికారులు భావిస్తున్నారు.

230
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles