దక్షిణ ధ్రువం చేరిన అపర్ణ కుమార్


Mon,January 21, 2019 02:31 AM

Aparna Kumar Becomes First Female IPS Officer To Reach South Pole

-ఘనత సాధించిన తొలి ఐపీఎస్ అధికారిణిగా గుర్తింపు
న్యూఢిల్లీ: ఐపీఎస్ అధికారి అపర్ణ కుమార్ అరుదైన ఘనత సాధించారు. సుమారు 111 కిమీ దూరం మంచులో నడిచి ఈ నెల 13న ఆమె దక్షిణ ధ్రువాన్ని చేరుకున్నారు. ఈ ఘనత సాధించిన తొలి ఐపీఎస్ అధికారిగా రికార్డు సృష్టించారు. 2002వ బ్యాచ్ ఉత్తరప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి అపర్ణ.. ప్రస్తుతం డెహ్రాడూన్‌లో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) డీఐజీగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ యాత్రకు బయలుదేరే ముందు నిమోనియాతో బాధపడినా వెరువక మందులు తీసుకుంటూనే దక్షిణ ధ్రువానికి పయనమయ్యారు. పలు అవరోధాల మధ్య అక్కడి విపత్కర వాతావరణ పరిస్థితులను అధిగమించి ఆమె ఈ ఘనత సాధించారు. భూమిపైనే అత్యంత శీతల ప్రదేశం అంటార్కిటికా వద్ద వాతావరణం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మేఘాలు కమ్మేవి. చలిగాలులు వీచేవి. మంచు కురిసేది. ఈ విపత్కర వాతావరణ పరిస్థితుల్లో మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రతల మధ్య రోజుకు 8 గంటలు నడక మరిచిపోలేని అనుభూతి. నా చేతులు, వేళ్లు చలితో బిగుసుకుపోయేవి. ఫ్రాస్ట్‌బైట్ (మంచు తిమ్మిరి, చలితో మొద్దుబారిపోవడం) వస్తుందేమోనని భయమేసేది. ఆరోగ్య సమస్యలు రాకుండా మరింత శ్రద్ధ తీసుకోవాల్సి వచ్చేది. సమస్యల మధ్య యాత్ర పూర్తి చేయడం ఆనందంగా ఉంది. ఆరోగ్యం, ఇతర కారణాలతో ఇద్దరు సహచరులు, ఓ గైడ్ మధ్యలోనే వైదొలిగారు అని అపర్ణ కుమార్ తన యాత్రను వివరించారు.

211
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles