ఏపీ భవన్ విభజనపై నేడు సమావేశంThu,January 12, 2017 01:31 AM

న్యూఢిల్లీ, నమస్తే తెలంగాణ: ఢిల్లీలోని ఏపీ భవన్ విభజనపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ మెహ్‌రుషి గురువారం సమావేశం నిర్వహించనున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రెండు రాష్ర్టాల అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ఢిల్లీలో ఉన్న రెండు రాష్ర్టాల రెసిడెంట్ కమిషనర్లు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఢిల్లీలోని ఏపీ భవన్‌ను రెండు రాష్ర్టాల మధ్య విభజించాల్సి ఉంది. భవన్ విభజనపై తెలంగాణ అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్ ఇప్పటికే కేంద్ర హోంమంత్రికి లేఖద్వారా తెలియజేశారు. ఏపీ మాత్రం పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆస్తుల విభజనకు రూపొందించిన జనాభా నిష్పత్తినే ప్రామాణికంగా తీసుకోవాలని వాదిస్తున్నది. ఈ నేపథ్యంలో రెండు రాష్ర్టాల మధ్య ఏకాభిప్రాయానికి కేంద్ర హోంశాఖ ప్రయత్నిస్తున్నది.

319
Tags
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS