యూపీలో మరో జర్నలిస్టు అరెస్ట్


Wed,June 12, 2019 02:03 AM

Another Noida Journalist Arrested For Defaming Yogi Adityana

నోయిడా (యూపీ), జూన్ 11: ఉత్తర్‌ప్రదేశ్‌లో జర్నలిస్టుల పై నిర్బంధం కొనసాగుతున్నది. యూపీ సీఎం యో గి ఆదిత్యనాథ్ ప్ర తిష్ఠను దిగజార్చే లా వ్యవహరించారంటూ నేషన్ లైవ్ ఎడిటర్ అన్షుల్ కౌశిక్‌ను సోమవారం రాత్రి పోలీసులు అరెస్టు చేశా రు. ఆయనను కోర్టు ముందు హాజరుపర్చగా న్యాయస్థానం 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీకి ఆదేశించింది. ఈనెల 6న ఇదే టీవీ చానెల్‌లో నిర్వహించిన ఓ చర్చా కార్యక్రమంలో ఓ మహిళ సీఎం ఆదిత్యనాథ్‌కు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ చానెల్ అధిపతి ఇషికా సింగ్, ఎడిటర్ అనూజ్ శుక్లాను 8వ తేదీన పోలీసులు అరెస్టు చేశారు. వారికి కూడా న్యాయస్థానం 14 రోజుల కస్టడీని విధించింది.

503
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles