ఉగ్రవాద దాడి కుట్రలో మరొకరు అరెస్ట్


Sun,January 13, 2019 12:36 AM

Another arrested in the terror attack raid

-ఇద్దరు నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి ఆదేశించిన న్యాయస్థానం
న్యూఢిల్లీ, జనవరి 12: ఉత్తర భారతంలోని ఢిల్లీ, మరికొన్ని ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నిన కేసులో తాజాగా మరొకరిని జాతీయ దర్యాప్తు బృందం(ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ముహమ్మద్ అబ్సర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు ఎన్‌ఐఏ తెలిపింది. మీరట్, హపూర్, ఘజియాబాద్ ప్రాంతాల్లో సోదాలు చేపట్టామని, ఈ సందర్భంగా అబ్సర్‌ను శుక్రవారం రాత్రి అరెస్టు చేశామని పేర్కొంది. మీరట్‌లోని జసోరా ప్రాంతానికి చెందిన అబ్సర్ ఘజియాబాద్‌లోని జామియా హుసేనియా అబ్దుల్ హస్సన్‌లో పాఠాలు చెబుతున్నాడని తెలిపింది. ఉగ్రవాద కుట్రలో భాగంగా ఈ కేసులో మరో నిందితుడైన ఇఫ్తఖార్ సాకిబ్‌తో కలిసి అబ్సర్ 2018లో జమ్ముకశ్మీర్‌లో రెండు నెలలు పర్యటించాడని ఎన్‌ఐఏ వెల్లడించింది. అబ్సర్‌ను కోర్టు ముందు హాజరుపరిచి కస్టడీ కోరుతామని పేర్కొంది. మరోవైపు ఇదే కేసులో అరెస్టు అయిన వారిలో ఇద్దరిని జ్యుడీషియల్ కస్టడీకి ఢిల్లీలోని చీఫ్ మెట్రోపాలిటిన్ మేజిస్ట్రేట్ ధర్మేందర్ సింగ్ ఆదేశించారు. ముఫ్తీ మహమ్మద్ సుహేల్, సాకిబ్ ఇఫ్తఖార్‌లను ఈ నెల 22 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని చెప్పారు. ఉగ్రవాద కుట్రకు సంబంధించి గతేడాది డిసెంబర్ 26న ఎన్‌ఐఏ మొత్తం 10 మందిని అరెస్టు చేయగా అందులో వీరిద్దరూ ఉన్నారు.

426
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles