ముగిసిన దవే అంత్యక్రియలుSat,May 20, 2017 02:02 AM

dave
భోపాల్, మే 19: అకస్మాత్తుగా గురువారం ఉదయం మృతిచెందిన కేంద్ర పర్యావరణశాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే అంత్యక్రియలను శుక్రవారం మధ్యప్రదేశ్‌లోని బంద్రభన్ నర్మదా నదీతీరాన అధికార లాంఛనాలతో నిర్వహించారు. దవే చితికి ఆయన సోదరుడు, మరో సమీప బంధువు నిప్పంటించారు. అంత్యక్రియలకు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, కేంద్రమంత్రులు హర్షవర్ధన్, ఉమాభారతి, అనంత్‌కుమార్, నరేంద్రసింగ్ తోమర్, తావర్‌చంద్ గెహ్లాట్ తదితరులు హాజరై నివాళులర్పించారు.

138

More News

VIRAL NEWS