స్వర్ణదేవాలయం మరింత ధగధగ


Tue,July 17, 2018 04:49 AM

Amritsar Golden Temple to glow brighter with 160 kg more gold

-160 కిలోల బంగారంతో తాపడం
-రూ.50 కోట్ల వ్యయంతో నాలుగు ప్రవేశ ద్వారాల గుమ్మటాలకు కొత్త హంగులు

అమృత్‌సర్: బంగారు వర్ణంతో మెరిసిపోయే అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయం త్వరలో మరింత ధగధగలాడనున్నది. సిక్కుల పవిత్ర క్షేత్రమైన ఈ ఆలయంలోని నాలుగు ప్రవేశ ద్వారాలపై ఉన్న గుమ్మటాల(డోమ్స్)ను 160 కిలోల బంగారంతో తాపడం చేసే ప్రక్రియ ప్రారంభమైనది. ఇందుకోసం సుమారు రూ.50 కోట్లను వ్యయం చేయనున్నారు. స్వర్ణదేవాలయంలోని నాలుగు ప్రవేశద్వారాలపై ఉన్న గుమ్మటాలను స్వర్ణమయం చేయాలని శిరోమణి గురుద్వారా ప్రబంధక్ కమిటీ(ఎస్‌జీపీసీ) కమిటీ నిర్ణయించింది. ఒక్కో గుమ్మటం కోసం 40 కేజీల చొప్పున మొత్తం నాలుగింటికి కలిపి 160 కిలోల బంగారాన్ని వినియోగించనున్నాం. ఇందులో భక్తులు సమర్పించిన బంగారం కూడా ఉంది. ఈ క్రతువు కోసం రూ.50 కోట్లు ఖర్చుచేయనున్నాం. ఘంటా ఘర్ సమీపంలోని ప్రధాన ప్రవేశద్వారం వద్ద పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈ పనుల్లో వలంటీర్లు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారు అని ఎస్‌జీపీసీ అధికారప్రతినిధి దల్జీత్‌సింగ్ బేడీ చెప్పారు. 192 ఏండ్ల క్రితం మహారాజా రంజిత్‌సింగ్ ఈ ఆలయాన్ని స్వర్ణమయం చేసేందుకు రూ.16.39 లక్షలు కేటాయించినట్లు చరిత్ర చెబుతున్నది. ఆ తర్వాత రంజిత్‌సింగ్ వారసులు, మహారాణులు, సిక్కు ప్రముఖులు డబ్బును దానం చేయడంతో ఆ మొత్తం అప్పట్లోనే రూ.64.11 లక్షలకు చేరింది.

582
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS