అద్వానీకి అమిత్ షా ఫోన్Fri,April 21, 2017 01:31 AM

amith
న్యూఢిల్లీ: పార్టీ మీ వెంట ఉంటుందని ఎల్‌కే అద్వానీకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భరోసా ఇచ్చారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో భాజపా అగ్రనేతలు ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌జోషి, ఉమాభారతిపై నేరపూరిత కుట్ర అభియోగాల కింద విచారణకు బుధవారం సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం అద్వానీతో అమిత్ షా ఫోన్‌లో మాట్లాడారు. పార్టీ అగ్రనేతలతోపాటు కేంద్ర మంత్రులు ఉమాభారతి, వినయ్ కతియార్‌పై విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో బీజేపీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

443

More News

VIRAL NEWS