వాస్తవాలను తెలుసుకొని మాట్లాడు


Fri,August 10, 2018 02:27 AM

Amit Shah Hits Back At Rahul Gandhi Check Facts When Done Winking

-రాహుల్‌పై ధ్వజమెత్తిన అమిత్ షా
-ఎస్సీ, ఎస్టీ చట్టం పటిష్ఠతకు కట్టుబడి ఉన్నామని వెల్లడి

న్యూఢిల్లీ, ఆగస్టు 9: ప్రధాని దళిత వ్యతిరేకి అని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ విమర్శించడంపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా తీవ్రంగా స్పందించారు. అసలైన దళిత వ్యతిరేకి కాంగ్రెస్ పార్టీనేనని విమర్శించారు. దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం, దళిత దిగ్గజ నాయకులను అవమానించడం కాంగ్రెస్ రక్తంలోనే ఉన్నదని ఆరోపించారు. రాహుల్‌గాంధీ.. కన్ను కొట్టి సైగ చేసి సంతోషం పడటం కాదు.. కండ్లు తెరిచి వాస్తవాలను తెలుసుకొని మాట్లాడు అని చురకలు అంటించారు. ఇటీవల పార్లమెంట్‌లో అవిశ్వాస తీర్మానం సందర్భంగా రాహుల్ ప్రధాని మోదీని హత్తుకొని అనంతరం తమ పార్టీ ఎంపీలవైపు చూస్తూ కన్నుకొట్టిన విషయం తెలిసిందే. అమిత్ షా గురువారం ట్వీట్ చేస్తూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని మరింత పటిష్ఠం చేయడానికి, ఓబీసీ కమిషన్‌కు సాధికారత కల్పించడానికి ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారు. ఇది బీజేపీ వారసత్వం. కానీ, దళిత నాయకులను కించపర్చడం, మండల్ కమిషన్ నివేదికను వ్యతిరేకించడం, ఓబీసీ కమిషన్ సాధికారతను అడ్డుకోవడం కాంగ్రెస్ వారసత్వం అని ధ్వజమెత్తారు.

514
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles