విదేశీ కొలువులపై తగ్గుతున్న మోజుThu,October 19, 2017 12:40 AM

-అమెరికా, బ్రిటన్‌లలో ఉద్యోగాలకు ఆసక్తి చూపని భారతీయులు
-ఆయా దేశాల్లో నెలకొన్న పరిస్థితులే కారణం

బెంగళూరు, అక్టోబర్ 18: విదేశాలలో ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ వెళ్లే భారతీయుల సంఖ్య గత ఏడాది కాలంగా తగ్గుతున్నట్టు తెలుస్తున్నది. అమెరికా లేదా బ్రిటన్ దేశాలలో ఉపాధిని పొందేందుకు భారతీయులు ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. కానీ అది ఇంతకుముందు పరిస్థితి అని, ఇప్పుడు ఆ దేశాలకు వెళ్లేందుకు భారతీయులు నిరాసక్తంగా ఉన్నారని ఇండీడ్ ఇండియా అనే ఉపాధి కల్పన వెబ్‌సైట్ పేర్కొంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాల దెబ్బకు ఆ దేశంలో ఉద్యోగాలు చేయాలనుకునే భారతీయుల సంఖ్య 40 శాతం తగ్గిపోయినట్లు తెలిపింది.

ఇక బ్రెగ్జిట్ పుణ్యమా అని బ్రిటన్‌కు ఉపాధి కోసం వెళ్లే వారి సంఖ్య కూడా 42 శాతం తగ్గినట్లు వెల్లడించింది. మొత్తంగా విదేశాల్లో ఉపాధిని వెతుక్కుంటూ వెళ్లే భారతీయుల సంఖ్య గత ఏడాది కాలంలో ఐదు శాతం తగ్గినట్లు తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాలలో నెలకొన్న అస్థిర రాజకీయ పరిస్థితుల కారణంగానే భారతీయులు అక్కడ ఉపాధి పొందడంపై నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారని, నిజానికి వారు స్వదేశంలోనే ఉపాధిని వెతుక్కోవాలనుకుంటున్నారని తెలిపింది.

214
Tags

More News

VIRAL NEWS