నేడు తిరుమలలో రథసప్తమి

Tue,February 12, 2019 04:11 AM

తిరుమల, నమస్తే తెలంగాణ: తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సుందరంగా తీర్చిదిద్దారు. సప్తవాహనాలపై ఊరేగే శ్రీవారిని దర్శించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఉదయం 4 గంటలకు మలయప్పస్వామి వాహన మండపానికి వేంచేయడంతో సప్తవాహన సేవలు మొదలవుతాయి. ఉదయం 5.30 కు సూర్యప్రభ వాహనం, 9 కు చిన్న శేషవాహనం, 11 కు గరుడవాహనం, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనం, సాయంత్రం 4 కు కల్పవృక్షవాహనం, 6 గంటలకు సర్వభూపాలవాహనం, రాత్రి 8 నుంచి చంద్రప్రభ వాహనంపై శ్రీవారిని ఊరేగించనున్నారు.

340
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles