ఫోర్బ్స్ జాబితాలో అక్షయ్ కుమార్


Fri,July 12, 2019 01:59 AM

Akshay Kumar only Bollywood star in Forbes rich celebrities list

భారత్ నుంచి ఆయనకొక్కడికే స్థానం
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఫోర్బ్స్ ప్రకటించిన ప్రపంచవ్యాప్తంగా అత్యం త పారితోషికం తీసుకుంటున్న 100 మంది ప్రముఖుల్లో భారత్ నుంచి బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్‌కు మాత్రమే చోటు దక్కిం ది. రూ.444 కోట్ల ఆదాయంతో 33వ స్థానం పొందారు. 2018 జాబితాలోనూ అక్షయ్‌కుమార్ 76వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 2018లో 82వ స్థానంలో నిలిచిన నటుడు సల్మాన్‌ఖాన్, 2017 జాబితాలో 65వ స్థానంలో నిలిచిన నటుడు షారుఖ్‌ఖాన్‌లకు ఈ ఏడాది చోటు లభించలేదు. అమెరికా గాయకుడు టేలర్ స్విఫ్ట్ ఈ ఏడాది జాబితాలో తొలి స్థానం పొందారు. గత 12 నెలల్లో రూ.1,266 కోట్లను (185 మిలియన్ డాలర్లు) సంపాదించారు. ఇక రెండు, మూడు స్థానాల్లో క్లైజీనర్, కన్ని వెస్ట్ నిలిచారు. టాప్-10లో సాకర్ క్రీడాకారులు మెస్సీ, రోనాల్డో, నెయ్‌మర్ ఉన్నారు.

226
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles