నాసిరకం సేవల్లో ఎయిర్ ఇండియాకు మూడో ర్యాంకుTue,January 10, 2017 01:57 AM

ఢిల్లీ: ప్రపంచ విమానయాన రంగంలో నాసిరకం సేవలకుగాను ఎయిర్ ఇండియాకు మూడో ర్యాంకు లభించింది. బెస్ట్ ఆన్‌టైమ్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా ైఫ్లెట్‌స్టాట్స్ ఏవియేషన్ ఇన్‌సైట్స్ అనే కంపెనీ ఈ మేరకు తెలిపింది. అంతర్జాతీయ విమానాల పనితీరు ప్రదర్శనను ైఫ్లెట్‌స్టాట్స్ అనే కంపెనీ ప్రతి సంవత్సరం వెల్లడిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఏ విమానం ఆలస్యంగా నడుస్తుంది, ఏ విమానంలో ప్రయాణాన్ని రద్దు చేసుకోవచ్చో ఈ కంపెనీ సమాచారం ఇస్తుంది.
air-india
ఈ సంస్థ తెలిపిన సమాచారం ప్రకారం 2016లో నాసిరకం సేవలు అందించిన పది అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ ఈవిధంగా ఉన్నాయి. హైనన్ ఎయిర్‌లైన్స్ 10, కొరియన్ 9, ఎయిర్ చైనా 8, హోంగ్‌కాంగ్ 7, చైనా ఈస్టర్న్ ఎయిర్‌లైన్స్ 6, ఏషియానా ఎయిర్‌లైన్స్ 5, ఫిలిపైన్ ఎయిర్‌లైన్స్ 4, ఎయిర్ ఇండియా 3, ఐస్‌ల్యాండర్ 2, యూరోపియన్ ఎయిర్‌లైన్స్ 1వ స్థానంలో నిలిచాయి. ఉత్తమ ప్రదర్శనలో (సమయానికి ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం) కేఎల్‌ఎమ్ 1వ, ఇబేరియా 2వ, జపాన్ ఎయిర్‌లైన్స్ 3వ స్థానంలో నిలిచాయి. 500 విభిన్న వనరుల ద్వారా తాము ఈ సమాచారాన్ని సేకరించామని ైఫ్లెట్‌స్టాట్స్ ఉపాధ్యక్షుడు జిమ్ హెట్జెల్ తెలిపారు. రన్‌వే టైమింగ్, రాడార్ సర్వీసులు, ఎయిర్‌లైన్ రికార్డులు, ఎయిర్‌పోర్ట్ డేటాను సేకరించి అంతర్జాతీయ విమానాల ప్రదర్శనను అంచనా వేశామని ఆయన పేర్కొన్నారు.

311
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS