కొత్త సర్కారులో తొలి 100 రోజులకు ఎజెండా రూపొందించండి


Tue,April 16, 2019 11:13 AM

Ahead of poll results PM Narendra Modi directs officials to prepare 100-day agenda

-ఎన్నికలు జరుగుతుండగానే ఉన్నతాధికారులకు మోదీ సూచన
-జీడీపీని రెండంకెలకు చేర్చడంపై దృష్టి
-2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
-మళ్లీ అధికార పీఠం తనదేనని ధీమా
న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మే 23వ తేదీన వెలువడనున్నాయి. అయితే ఈ ఫలితాలు వెలువడిన తర్వాత తాను వరుసగా రెండోసారి అధికార పగ్గాలను చేపట్టడం ఖాయమని ధీమాతో ఉన్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ రానున్న ఐదేండ్లలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)ని రెండంకెలకు పెంచడంపై దృష్టి సారించారు. తొలి వంద రోజుల్లో కొత్త ప్రభుత్వం చేపట్టాల్సిన పనులకు సంబంధించిన ఎజెండాను రూపొందించాల్సిందిగా ఆయన ఇప్పటికే ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో), నీతి ఆయోగ్‌తోపాటు ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ (పీఎస్‌ఏ) ప్రొఫెసర్ కే విజయరాఘవన్‌కు సూచించారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని, ఆర్థిక, అధికార సంబంధమైన సంస్కరణలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు దోహదపడేలా ఈ ఎజెండాను రూపొందించాలని ప్రధాని కోరినట్టు పీఎంవో ఉన్నతాధికారితోపాటు నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు, పీఎస్‌ఏ వెల్లడించారు. చమురు, సహజవాయువు, ఖనిజాలు, మౌలిక వసతులు, విద్యా రంగాలను సరళతరం చేయడం, అధికార యంత్రాంగంలో అలసత్వ ధోరణిని రూపుమాపడం ద్వారా 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేలా రానున్న 100 రోజుల్లో పునాదులు వేయడంపై దృష్టి సారించినట్టు ఈ ముగ్గురు ఉన్నతాధికారుల్లో ఒకరు తెలిపారు.

ప్రస్తుతం దేశమంతా లోక్‌సభ ఎన్నికలపై దృష్టిసారిస్తే.. పీఎంవో, నీతి ఆయోగ్, పీఎస్‌ఏ కార్యాలయాలు మాత్రం వారాంతాల్లో సమావేశాలను నిర్వహిస్తూ ఈ ఎజెండాను రూపొందించడంలో నిమగ్నమయ్యాయి. వ్యర్థం నుంచి సంపదను సృష్టించడం, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య వసతులను మెరుగుపర్చడం ద్వారా ప్రభుత్వం ప్రజలతో అనుసంధానమై ఉండేలా ఈ ఎజెండాను రూపొందిస్తున్నారు. ఇందుకోసం మైనింగ్, బొగ్గు, విద్యుత్, ఇంధన, విద్య, ప్రాథమిక ఆరోగ్య రంగాలతోపాటు ఉద్యోగాల కల్పనకు దోహదపడే పర్యాటక, ఎంఎస్‌ఎంఈ (చిన్న, మధ్యతరహా పరిశ్రమల) రంగాలపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నారు. మోదీ మళ్లీ అధికారంలోకి వస్తే తాగునీటి సరఫరా, నదుల అనుసంధానానికి అధిక ప్రాధాన్యమివ్వనున్నట్టు ఉన్నతాధికారులు తెలిపారు. దక్షిణ భారత దేశానికి, ప్రత్యేకించి తమిళనాడుకు నీటిని అందించేందుకు నదుల అనుసంధానమే ఏకైక మార్గమని ప్రధాని మోదీ గుర్తించారు. వర్షా కాలంలో నదుల నుంచి వృథాగా సముద్రంలో కలుస్తున్న నీటిని సద్వినియోగం చేసుకోవాలని, ఇందుకోసం ఎగువ ప్రాంతాల్లో రిజర్వాయర్లను నిర్మించాలని ఆయన భావిస్తున్నారు అని ఓ ఉన్నతాధికారి చెప్పారు. దేశ వ్యాప్తంగా పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు వీలుగా రోడ్లు, విమానాశ్రయాలు, పోర్టులు, ఇతర మౌలిక వసతుల మెరుగుదలకు ప్రాధాన్యమివ్వాలని కూడా మోదీ యోచిస్తున్నట్టు నీతి ఆయోగ్ ఉన్నతాధికారి తెలిపారు.

394
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles