Telangana Intermediate 1st & 2nd Year Results 2019

పాక్ జాతీయ దినోత్సవం సందర్భంగా


Sat,March 23, 2019 02:39 AM

Ahead Of Pak National Day Imran Khan Tweets PM Modi Message to HIM

-ఇమ్రాన్‌కు మోదీ శుభాకాంక్షలు
-పాక్ హైకమిషన్ కార్యక్రమాన్ని బహిష్కరించిన భారత్
న్యూఢిల్లీ/ ఇస్లామాబాద్, మార్చి 22: పాకిస్థాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీ శుభాకాంక్షల సందేశం పంపారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రతి యేటా మార్చి 23న పాకిస్థాన్ జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నది. కాగా, ఉగ్రవాద, హింస రహిత వాతావరణంలో ప్రజాతంత్ర శాంతియుత, ప్రగతిశీల శ్రేయోదాయక ప్రాంతంగా భారత్ ఉపఖండాన్ని అభివృద్ధి చేసేందుకు ఇరు దేశాలు కలిసి పని చేయాల్సిన సమయం ఆసన్నమైందని ప్రధాని మోదీ తన సందేశంలో పేర్కొన్నట్లు సమాచారం.

గత నెలలో పుల్వామాలో జరిగిన ఉగ్రదాడి, పాక్‌లోని బాలాకోట్‌లోని జైషే ఉగ్రవాద శిబిరంపై ఐఏఎఫ్ వైమానిక దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య గల తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో ఇమ్రాన్‌ఖాన్‌కు మోదీ శుభాకాంక్షలు తెలుపడం ప్రాధాన్యం సంతరించుకున్నది. ప్రధాని మోదీ పంపిన శుభాకాంక్షల సందేశాన్ని ఇమ్రాన్ ట్వీట్ చేశారు. మరోవైపు ఢిల్లీలో పాక్ హైకమిషన్ శనివారం నిర్వహించనున్న పాకిస్థాన్ జాతీయ దినోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాలని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి జమ్ముకశ్మీర్‌లోని వేర్పాటువాద, హురియత్ కాన్ఫరెన్స్ నేతలను ఆహ్వానించడమే దీనికి కారణమని కేంద్ర ప్రభుత్వ అధికారులు తెలిపారు.

133
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles