టార్గెట్ ఈశాన్యం!


Fri,March 15, 2019 11:25 AM

AGP to fight Lok Sabha polls with BJP in Assam

-25 స్థానాల్లో 22 చోట్ల పాగాకు కమలనాథుల కార్యాచరణ
-వివిధ పార్టీల నేతలతో బీజేపీ నేత రాంమాధవ్ సుదీర్ఘ మంతనాలు, పొత్తులు ఖరారు

గువహటి: ఈశాన్య రాష్ర్టాల్లో పాగాకు కమలనాథులు సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. అక్కడి 8 రాష్ర్టాల్లోని 25 లోక్‌సభ సీట్లలో కనీసం 22 సీట్ల కైవసానికి వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఆయా రాష్ర్టాల్లో పలు పార్టీల తో పొత్తులు కుదుర్చుకుంటున్నారు. ఈ మేరకు బీజే పీ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ రెండు రోజులుగా వివిధ పార్టీలతో సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. ఏజీపీ లాంటి పాత మిత్రులను మళ్లీ కూటమిలోకి తేవడంలో సఫలమయ్యారు. బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్), ఇండిజీనస్ పీపు ల్స్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర (ఐపీఎఫ్‌టీ), నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనలిస్టు డెమొక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీ, సిక్కిం క్రాంతికారీ మోర్చా తదితర పార్టీలు/కూటములతో జరిపిన చర్చలు ఫలప్రదమైనట్లు బుధవారం రాంమాధవ్ మీడియాకు చెప్పారు.

east-india-bjp
తాము నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్ (ఎన్‌ఈడీఏ) పేరుతో కూటమిగా ఏర్పడ్డామని, చైర్మన్‌గా హిమంత బిశ్వ శర్మ వ్యవహరిస్తారని చెప్పారు. ఇదో చారిత్రక దినం. ఈశాన్య రాష్ర్టాల్లోని 25 సీట్లలో మా కూటమి 22 చోట్ల సత్తా చాటుతుంది. మోదీ రెండోసారి ప్రధాని కావడంలో కూటమి కీలకపాత్ర పోషిస్తుంది అని ఫేస్‌బుక్‌లో రాంమాధవ్ పోస్ట్ చేశారు. అసోం, నాగాలాండ్, మేఘాలయ, త్రిపుర, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్ సీఎంలు శర్బానంద సోనొవాల్, నెఫ్యూరియో, కన్రాడ్ సంగ్మా, బిప్లవ్‌కుమార్ దేవ్, ఫెమా ఖండూ, బీరెన్‌సింగ్‌లతో పొత్తులను చర్చించి, ఖరారు చేసినట్లు చెప్పారు.

ram-madhav

అసోంలో ఏజీపీ, బీజేపీ.. భాయీ భాయీ..

పౌరసత్వ బిల్లుపై ఆగ్రహించి దూరమైన మిత్రపక్షం అసోం గణపరిషత్‌తో దోస్తీకి బీజేపీ సై అన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఏజీపీ, బీజేపీ కలిసి అధికార కాంగ్రెస్‌ను మట్టికరిపించాయి. లోక్‌సభ ఎన్నికల తరుణంలో పౌరసత్వ బిల్లుపై రెండు పార్టీల మధ్య తీవ్రస్థాయిలో విభేదాలు పొడసూపాయి. దీంతో అసోంలోని బీజేపీ నేతృత్వంలోని సంకీర్ణ సర్కారు నుంచి ఏజీపీ వైదొలిగింది. ఆ పార్టీకి చెందిన ముగ్గురు మంత్రులు కూడా బయటకు వచ్చారు. దీంతో పరిస్థితి బీజేపీకి ప్రతికూలంగా మారింది. ఈ నేపథ్యంలో రాంమాధవ్ అక్కడికి చేరుకుని ఏజీపీ నేతలతో సుదీర్ఘ మంతనాలు జరిపి, కూటమిలోకి ఆహ్వానించారు.

348
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles