మళ్లీ ట్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్


Fri,January 11, 2019 12:47 AM

Again triple talaq ordinance

-కేంద్ర మంత్రివర్గం నిర్ణయం
న్యూఢిల్లీ, జనవరి 9: ట్రిపుల్ తలాక్‌ను నేరంగా పరిగణించే ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీ జేయాలని కేంద్ర మంత్రివర్గం గురువారం నిర్ణయించింది. గతేడాది సెప్టెంబర్‌లో జారీ చేసిన మొదటి ఆర్డినెన్స్ గడువు జనవరి 22తో పూర్తయిపోనుంది. ఈ నేపథ్యంలో మళ్లీ ఆర్డినెన్స్ జారీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. మరోవైపు భారతీయ వైద్య మండలి ఆర్డినెన్స్‌ను కూడా మళ్లీ జారీచేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జమ్మూ కశ్మీర్‌లో రెండు ఎయిమ్స్, గుజరాత్‌లో ఓ ఎయిమ్స్‌ను ఏర్పాటు చేసేందుకు పచ్చజెండా ఊపింది. భారత్, జపాన్ మధ్య 75 బిలియన్ డాలర్ల విలువైన నగదు మార్పిడి ఒప్పందానికి క్యాబినెట్ అంగీకారం తెలిపింది. పెట్టుబడుల ప్రోత్సాహం కోసం అత్యాధునిక సింగిల్ విండో విధానం అభివృద్ధికి ఇరు దేశాల కుదిరిన అవగాహన ఒప్పందానికి కూడా ఆమోదం తెలిపింది. నూతన, పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి విషయంలో సాంకేతిక సహకారం పెంపొందించుకునేందుకు భారత్, ఫ్రాన్స్ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి మంత్రివర్గం సమ్మతి తెలిపింది.

153
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles